Bajaj Pulsar : పల్సర్ లవర్స్‌కు మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఆగస్టు 12న సరికొత్త పల్సర్ బైక్ లాంచ్

ఆగస్టు 12న సరికొత్త పల్సర్ బైక్ లాంచ్

Update: 2026-07-31 13:40 GMT

Bajaj Pulsar : భారతీయ టూ వీలర్ బజాజ్ ఆటో తమ అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆగస్టు 12, 2026న ఒక సరికొత్త పల్సర్ మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. అయితే రాబోయే బైక్ పేరు, వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఆటోమొబైల్ వర్గాల అంచనా ప్రకారం ఇది నెక్స్ట్ జనరేషన్ పల్సర్ N160, పల్సర్ 125 లేదా పల్సర్ 150 అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

రాబోయే కొద్ది వారాల్లో 10 కొత్త మోడళ్లు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంలో పుణేకు చెందిన బజాజ్ కంపెనీ రాబోయే కొద్ది వారాల వ్యవధిలోనే ఏకంగా 10 కొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ క్రమంలో కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో 125 సీసీ లేదా 150 సీసీ విభాగంలో రాబోతున్న బైక్‌కు సంబంధించిన స్పష్టమైన సూచనలు కనిపించాయి. యువతను విశేషంగా ఆకట్టుకునేలా ఈ కొత్త బైక్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అప్‌డేటెడ్ డిజైన్.. అదిరిపోయే డిజిటల్ ఫీచర్లు!

ఇటీవల రహదారులపై పరీక్షలు జరుపుతూ కనిపించిన ఈ సరికొత్త పల్సర్ బైక్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులు స్పష్టంగా కనిపించాయి. కొత్తగా అప్‌డేట్ చేసిన బాడీ ప్యానెల్స్, మరింత మస్క్యులర్‌గా మారిన ఫ్యూయల్ ట్యాంక్, పెద్ద ఫ్రంట్ కౌల్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు పెద్ద ట్యాంక్ ఎక్స్టెన్షన్లు, పొడవైన సీటు, అల్లాయ్ వీల్స్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ వ్యవస్థలు దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. సాంకేతిక పరంగా నెక్స్ట్-జెన్ పల్సర్ 125, 150 మోడళ్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ ఫీచర్లు ఉండే పూర్తి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించే అవకాశముంది.

ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అండ్ గేర్‌బాక్స్

ఇంజిన్ విభాగంలో కంపెనీ ఎలాంటి పెద్ద మార్పులు చేయకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పల్సర్ 125 మోడల్ 124.38 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 11.8 PS పవర్, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే పల్సర్ 150 మోడల్ 149.5 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో 14 PS పవర్, 13.4 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండింటిలోనూ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, 5-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ సదుపాయం కొనసాగనుంది.

Tags:    

Similar News