Renault Duster : భారత రోడ్లపై డస్టర్ విశ్వరూపం.. ఆ కిల్లర్ లుక్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు
ఆ కిల్లర్ లుక్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు
Renault Duster : రెనాల్ట్ డస్టర్.. ఈ పేరు వింటేనే కార్ల ప్రేమికులకు ఒక తెలియని ఎగ్జైట్‌మెంట్. ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ ట్రెండ్‌ను సెట్ చేసిన ఈ కారు, ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్ళీ మన రోడ్ల మీదకు వచ్చేస్తోంది. తాజాగా ఈ కొత్త డస్టర్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఖాకీ గ్రీన్ కలర్‌లో మెరిసిపోతున్న ఈ కారును చూస్తుంటే, పాత డస్టర్ కంటే ఇది చాలా పవర్‌ఫుల్ అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చుకుందామా అని జనం ఎదురుచూస్తున్నారు.
కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొత్త రెనాల్ట్ డస్టర్ చూస్తుంటే చాలా వెడల్పుగా, ఎత్తైన బాడీతో సెగ్మెంట్లోనే బెస్ట్ రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. దీని వెనుక భాగంలో ఉన్న కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, స్టైలిష్ బంపర్స్ మరియు 18 ఇంచుల భారీ అలాయ్ వీల్స్ కారుకు ఒక లగ్జరీ లుక్ ఇచ్చాయి. లోపలి విషయానికి వస్తే, 10 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది, ఇది గూగుల్ ఓఎస్‌తో పనిచేస్తుంది. అంటే ఇక ఆండ్రాయిడ్ ఆటో కోసం ఫోన్ కలపాల్సిన అవసరం లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. అలాగే 10.25 ఇంచుల డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెెంటిలేటెడ్ సీట్లు మరియు భద్రత కోసం ADAS టెక్నాలజీని కూడా జోడించారు.
మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు
ఈసారి రెనాల్ట్ తన కస్టమర్ల కోసం మూడు రకాల పవర్‌ఫుల్ ఇంజిన్లను సిద్ధం చేసింది. ఎంట్రీ లెవల్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఉండగా, స్పీడ్ ఇష్టపడే వారి కోసం 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 163hp పవర్‌ను, 280Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లోనే టాప్ పెర్ఫార్మెన్స్ కావడం విశేషం. ఇక మైలేజీ కావాలనుకునే వారి కోసం 1.6 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఉంది. ఇందులో 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది కారును సిటీల్లో సైలెంట్‌గా, తక్కువ ఇంధనంతో నడిపిస్తుంది.
డెలివరీ ఎప్పుడు? ఎవరికి పోటీ?
రినాల్ట్ డస్టర్ నాన్-హైబ్రిడ్ మోడల్ డెలివరీలు మార్చి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక హైబ్రిడ్ మోడల్ కావాలనుకునే వారు వచ్చే ఏడాది దీపావళి వరకు ఆగాల్సిందే. ఈ కారు మార్కెట్లో టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. కారు పొడవు 4.2 మీటర్ల నుంచి 4.4 మీటర్ల వరకు ఉండటంతో ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.