Toyota Hilux : బోల్డ్ లుక్.. హైటెక్ ఫీచర్లు.. జూలై 28న టయోటా కొత్త హైలక్స్ గ్రాండ్ ఎంట్రీ
టయోటా కొత్త హైలక్స్ గ్రాండ్ ఎంట్రీ
Toyota Hilux : లైఫ్‌స్టైల్ పిక్-అప్ ట్రక్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న టయోటా హైలక్స్ కొత్త లుక్‌లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జూలై 28న అధికారికంగా విడుదల కానున్న ఈ శక్తివంతమైన వాహనానికి సంబంధించి టయోటా ఒక నయా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో హైలక్స్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు, సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
అగ్రెసివ్ ఫ్రంట్ లుక్, స్టైలింగ్ : టీజర్ ఆధారంగా కొత్త హైలక్స్ ఫ్రంట్ డిజైన్‌లో కీలక మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. మునుపటి మోడల్ కంటే భిన్నంగా సరికొత్త హనీకామ్ స్టైల్ గ్రిల్, అందులోనే టయోటా బోల్డ్ లెటరింగ్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) అమర్చారు. అంతేకాకుండా ముందర సిల్వర్ స్కిడ్ ప్లేట్, రీ-డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, కార్గో బెడ్ వెనుక రోల్ బార్ ఈ పిక్-అప్ ట్రక్‌కు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫ్-రోడ్ మెరుగులు దిద్దాయి.
ప్రీమియం కేబిన్ & హైటెక్ ఫీచర్లు : ఇంటీరియర్‌కు సంబంధించి అధికారిక చిత్రాలు ఇంకా రానప్పటికీ, కేబిన్ పూర్తి ఆధునిక రూపంలో రానున్నట్లు సమాచారం. ఇందులో డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్) ఉండనున్నాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, సురక్షిత ప్రయాణం కోసం లెవెల్-2 ADAS వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ సామర్థ్యం : కొత్త హైలక్స్‌లో రీ-ట్యూన్ చేసిన విశ్వసనీయ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. ఇది 204 bhp పవర్, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు 4WD సిస్టమ్ జతచేయబడుతుంది. ఈసారి అదనంగా 48V మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను జత చేయడం ద్వారా మెరుగైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభూతి లభిస్తుంది.
అంచనా ధర ఎంత ఉండొచ్చు?
భారత మార్కెట్లో కొత్త టయోటా హైలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.5 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది (ఆన్-రోడ్ ధర రూ. 36 లక్షల నుంచి రూ. 46 లక్షల మధ్య ఉండొచ్చు). రాబోయే రోజుల్లో టయోటా నుంచి ఫార్చ్యూనర్, ల్యాండ్ క్రూజర్ సిరీస్ కొత్త మోడళ్లు కూడా రాబోతుండటంతో ఆటోమొబైల్ ప్రేమికులకు మంచి ఆప్షన్లు లభించనున్నాయి.