Nissan Magnite : కారు చిన్నదే కానీ క్రేజ్ మాత్రం చాలా పెద్దది..మాగ్నైట్ కొనేందుకు క్యూ కడుతున్న జనం

మాగ్నైట్ కొనేందుకు క్యూ కడుతున్న జనం

Update: 2026-02-16 12:17 GMT

Nissan Magnite : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరకే ఎస్‌యూవీ అనుభూతిని అందించే కార్లకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. ఈ విషయంలో జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ తన మాగ్నైట్ మోడల్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం నిస్సాన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక కారు ఇదే అయినప్పటికీ, ఇది అమ్మకాల్లో మాత్రం అదరగొడుతోంది. జనవరి 2026 నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే, మాగ్నైట్ మరోసారి తన సత్తా చాటుకుంది. గడిచిన నెలలో ఏకంగా 2,502 మంది కొత్త కస్టమర్లు ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది జనవరిలో (2,404 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే, ఈసారి 4.08 శాతం వృద్ధి నమోదైంది.

నిస్సాన్ మ్యాగ్నైట్ పనితీరు విషయంలో కస్టమర్లను ఏమాత్రం నిరాశ పరచదు. ఇందులో రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, ఇది 72bhp పవర్, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండోది మరింత శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 100bhp గరిష్ట శక్తిని, 160Nm టార్క్‌ను అందిస్తుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సిటీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ జర్నీలకు కూడా ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, మ్యాగ్నైట్ లోపల ఫీచర్ల విషయంలో నిస్సాన్ అస్సలు తగ్గలేదు. కారు క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటికి తోడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు నేటి తరం యువతను ఆకట్టుకుంటున్నాయి. కారు ఇంటీరియర్ డిజైన్ చాలా నీట్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది.

ప్రస్తుత కాలంలో కార్ల కొనుగోలుదారులు భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిస్సాన్ తన మాగ్నైట్ లో 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా అందిస్తోంది. గ్లోబల్ క్రాష్ టెస్టుల్లో కూడా ఈ కారు మంచి రేటింగ్ సాధించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి మరిన్ని భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. టాటా పంచ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తోంది.

మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ప్రధానంగా టాటా నెక్సాన్, మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి ఉద్దండులతో తలపడుతోంది. అయితే వీటికంటే తక్కువ ధరలో లభించడమే మ్యాగ్నైట్ కు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.5.61 లక్షల నుంచి ఉండగా, టాప్ మోడల్ ధర రూ.10.75 లక్షల వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఒక స్టైలిష్ ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి మాగ్నైట్ ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News