Nissan Tekton : క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ.. జూలై 9న మార్కెట్లోకి నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ

జూలై 9న మార్కెట్లోకి నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ

Update: 2026-06-04 10:53 GMT

Nissan Tekton : భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ దూసుకురాబోతోంది. తన సరికొత్త మోడల్ నిస్సాన్ టెక్టాన్‎ను జూలై 9, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ కారు లాంచ్‌కు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో, ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న టెక్టాన్ కారును బెంగళూరు వీధుల్లో టెస్టింగ్ చేస్తుండగా ఆటోమొబైల్ ప్రియులు గుర్తించారు. ఈ సరికొత్త ఎస్‌యూవీ మార్కెట్లో ఉన్న పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

నిస్సాన్ టెక్టాన్ కారును ప్రముఖ రెనాల్ట్ డస్టర్ థర్డ్ జనరేషన్ మోడల్ ఆధారంగా రూపొందించారు. ఇది డస్టర్ లాగే ఆర్జీఎంపీ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైంది. ఈ కారు వెనుక భాగంలో ఒక పవర్‌ఫుల్ బంపర్, స్టైలిష్ విండ్‌షీల్డ్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం, ఇందులో సరికొత్త C ఆకారపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉండబోతున్నాయి. కారు ముందు భాగంలో పూర్తి వెడల్పుతో కూడిన లైట్‌బార్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, బోనెట్‌పై పెద్ద అక్షరాలతో TEKTON అని రాసి ఉండటం వల్ల దీనికి ఒక అగ్రెసివ్ లుక్ వచ్చింది.

టెక్టాన్ కారు లోపలి భాగంలో నిస్సాన్ తన మార్కు ప్రీమియం ట్రిమ్స్ , డిజైన్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ కారులో ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, 10.1 ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అమర్చారు. దీనితో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్‌బిల్ట్ గూగుల్ కనెక్టివిటీ, 6-స్పీకర్ల అర్కామిస్ ఆడియో సిస్టమ్, 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 48 కలర్స్ అంబియంట్ లైటింగ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెకానికల్ పరంగా చూస్తే.. నిస్సాన్ టెక్టాన్ కారులో రెండు రకాల పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేస్తున్నారు. మొదటిది 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కాగా, ఇది 100 PS పవర్‌ను, 160 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇక రెండోది మరింత శక్తివంతమైన 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 163 PS పవర్‌ను, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది.

ఈ పెట్రోల్ ఇంజన్లతో పాటు, నిస్సాన్ కంపెనీ రాబోయే రోజుల్లో ఈ ఎస్‌యూవీలో ఒక పవర్‌ఫుల్ 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ సిస్టమ్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్‌ను జత చేస్తారు. దీనివల్ల కారు మైలేజ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత, నిస్సాన్ టెక్టాన్ కారు హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర కూడా దాదాపు రెనో డస్టర్ ధర శ్రేణిలోనే ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News