Oben Rorr Evo : భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు కేవలం ఈవీ స్కూటర్ల హవా మాత్రమే నడవగా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు కూడా క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ ప్రముఖ ఈవీ బ్రాండ్ ఓబెన్ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి తెచ్చిన సరికొత్త బైక్ Oben Rorr Evo సంచలనాలు సృష్టిస్తోంది. లాంచ్ చేసిన కేవలం 15 రోజుల్లోనే ఈ బైక్ ఏకంగా 25,000 కి పైగా బుకింగ్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో భారతదేశంలోనే అత్యంత వేగంగా బుక్ అయిన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌గా ఇది నిలిచింది. కస్టమర్ల నుంచి వస్తున్న ఈ భారీ రెస్పాన్స్ చూసి కంపెనీ వచ్చే జూన్ 2026 నుంచే కస్టమర్లకు డెలివరీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

మొదటి 10,000 మందికి బంపర్ ఆఫర్..

కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేమెంట్ పోర్టల్‌ను ప్రారంభించింది. మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ బైక్‌ను కేవలం రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే అందిస్తోంది. ఆ తర్వాత దీని సాధారణ ధర రూ.1,24,999 (ఎక్స్-షోరూమ్) గా ఉండనుంది. ఈ బైక్‌లో సురక్షితమైన, ఎక్కువ కాలం మన్నే 3.4kWh LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఇది ఏకంగా 180 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 90 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, కస్టమర్ల నమ్మకం కోసం కంపెనీ ఈ బ్యాటరీపై ఏకంగా 8 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తోంది.

అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు

ఈ బైక్‌లో కంపెనీ సొంతంగా తయారు చేసిన 9kW పవర్‌ఫుల్ IPMSM మోటార్ అమర్చారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు. ఫీచర్ల పరంగా చూస్తే.. 5-ఇంచుల టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఓటీఏ అప్‌డేట్స్, జియో ఫెన్సింగ్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీకి చెందిన SmartIQ టెక్నాలజీ రైడింగ్ స్టైల్‌ను బట్టి మైలేజీని మరో 15 శాతం పెంచుతుంది. రోజువారీ వాడకం కోసం ఇందులో సెగ్మెంట్‌లోనే పొడవైన సీటు, 10 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇండియన్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, తక్కువ ధరలో నమ్మకమైన సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని ఓబెన్ ఎలక్ట్రిక్ సీఈఓ మధుమితా అగర్వాల్ తెలిపారు.

Tags: