Renault: పండుగల సీజన్ సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా తన కస్టమర్ల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆటోమొబైల్ మార్కెట్లో సందడి పెంచడానికి క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లతో పాటు సరికొత్త డస్టర్ కారుపై ఏకంగా రూ. 2.05 లక్షల వరకు లబ్ధి పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ అద్భుతమైన ఫెస్టివ్ డీల్స్ అక్టోబర్ 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్లతో కార్ల ప్రియులను ఆకట్టుకుంటోంది.

రెనాల్ట్ క్విడ్

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపై వేరియంట్ ఆధారంగా తగ్గింపులు ఇస్తున్నారు. క్విడ్ క్లైంబర్ మోడల్‌పై అత్యధికంగా రూ. 55,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 3,000 క్యాష్ డిస్కౌంట్, ఎన్‌బిఐ ప్రైస్ ఆఫర్స్, రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఇక క్విడ్ ఎవల్యూషన్, టెక్నో వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందుతున్నాయి.

రెనాల్ట్ కైగర్

కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనాల్ట్ కైగర్ కొనుగోలుదారులు గరిష్టంగా రూ. 84,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కైగర్ ఎవల్యూషన్+, టెక్నో, ఎమోషన్ వేరియంట్లలో రూ. 25,000 నేరుగా క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. పాత రెనాల్ట్ కారును ఇచ్చి కొత్తది కొంటే రూ. 35,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వస్తుంది. ఇతర బ్రాండ్ కార్లపై రూ. 25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వరకు ఉచిత సర్వీస్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు.

రెనాల్ట్ ట్రైబర్

ఏడు సీట్ల ఫ్యామిలీ కారు రెనాల్ట్ ట్రైబర్ MY26 వేరియంట్‌లపై అత్యధికంగా రూ. 81,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ ట్రిమ్స్‌పై రూ. 25,000 నగదు ఆదా అవ్వడంతో పాటు పాత రెనాల్ట్ కారు మార్పిడిపై రూ. 35,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. స్క్రాపేజ్ విధానం ద్వారా మరో రూ. 25,000 తగ్గింపు అందుతుంది. ఇతర వేరియంట్లకు రూ. 41,000 నుంచి రూ. 71,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.

కొత్త రెనాల్ట్ డస్టర్

ఈ పండుగ సీజన్‌లో అత్యంత పెద్ద ఆఫర్ నయా రెనాల్ట్ డస్టర్‌పై వచ్చింది. డస్టర్ టెక్నో+, ఐకానిక్ వేరియంట్లకు ఏకంగా రూ. 2.05 లక్షల వరకు భారీ బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ. 50,000 డైరెక్ట్ క్యాష్ ఆఫర్, 4.99% తక్కువ వడ్డీ ఫైనాన్స్ స్కీమ్ ఉన్నాయి. డస్టర్ నుంచి డస్టర్ ఎక్స్ఛేంజ్‌కు రూ. 1.50 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. ఎవల్యూషన్, అడ్వెంచర్ మోడళ్లకు కూడా రూ. లక్ష వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

Tags: