Renault Kiger : ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. రూ.88,500 భారీ తగ్గింపుతో రెనాల్ట్ కైగర్.. ఆఫర్ కొద్దిరోజులే
రూ.88,500 భారీ తగ్గింపుతో రెనాల్ట్ కైగర్.. ఆఫర్ కొద్దిరోజులే
Renault Kiger : ఎస్‌యూవీ కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త.. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిచ్చే రెనాల్ట్ కైగర్ పై కంపెనీ ఈ మే నెలలో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. సుమారు రూ.88,500 వరకు తగ్గింపుతో ఈ కారును సొంతం చేసుకునే సువర్ణావకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్లు మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రెనాల్ట్ ఇండియా తన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ కైగర్ పై అందిస్తున్న రూ.88,500 ప్రయోజనాల్లో రకరకాల విభాగాలు ఉన్నాయి. ఇందులో నేరుగా రూ.20,000 నగదు తగ్గింపు లభిస్తుంది. పాత కారును మార్చుకోవాలనుకునే వారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే పాత కస్టమర్ల కోసం మరో రూ.15,000 లాయల్టీ బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా కార్పొరేట్ ఉద్యోగులకు రూ.10,000 వరకు, గ్రామీణ ప్రాంత కస్టమర్లకు రూ.4,000 వరకు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. తమిళనాడులో కార్పొరేట్ బెనిఫిట్ రూ.15,000 వరకు ఉండటం విశేషం.
బడ్జెట్ ధరలోనే లభిస్తున్నప్పటికీ, ఫీచర్ల విషయంలో రెనాల్ట్ కైగర్ అస్సలు తగ్గలేదు. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కస్టమర్లకు రక్షణగా ఉంటాయి.
రెనాల్ట్ కైగర్ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది: 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.0-లీటర్ ఎనర్జీ పెట్రోల్. ఇందులో ట్రాన్స్‌మిషన్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్, ఈజీ-ఆర్ AMT, ఎక్స్-ట్రానిక్ CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా దీని టర్బోచార్జ్డ్ ఇంజిన్ లీటరుకు 20.62 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు ధరలు రూ.5.81 లక్షల నుంచి రూ.10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. మార్కెట్లో ఇది మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది.