Renault Kwid : మారుతి ఆల్టో, టాటా టియాగోలకు టెన్షన్.. సరికొత్త లుక్‌తో వస్తున్న రెనాల్ట్ క్విడ్

సరికొత్త లుక్‌తో వస్తున్న రెనాల్ట్ క్విడ్

Update: 2026-06-29 03:40 GMT

Renault Kwid : భారతదేశంలో చిన్న కార్ల విభాగంలో తనదైన ముద్ర వేసిన రెనాల్ట్ క్విడ్, ఇప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారుల ముందుకు రాబోతోంది. జూలై 3న లాంచ్ కాబోతున్న ఈ అప్‌డేటెడ్ కారులో ఎక్స్ టీరియర్ పరంగా కీలక మార్పులు జరగనున్నాయి. టెస్టింగ్ సమయంలో కనిపించిన మోడల్స్ ప్రకారం, కారు ముందు భాగంలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, కొత్త స్టైలింగ్ కలిగిన లైటింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. రెనాల్ట్ కంపెనీ గ్లోబల్ మార్కెట్లో ఉపయోగిస్తున్న సరికొత్త సిగ్నేచర్ డిజైన్ తరహాలోనే ఈ కారును కూడా ముస్తాబు చేశారు.

డిజిటల్ ఫీచర్లతో నెక్స్ట్ లెవెల్ క్యాబిన్

కారు లోపలి భాగంలో కూడా రెనాల్ట్ ఈసారి క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కారు డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో స్వల్ప మార్పులతో పాటు ప్రయాణికులకు మంచి వినోదాన్ని పంచేందుకు మునుపటి కంటే పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. దీనితో పాటు డ్రైవర్ కోసం పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అమర్చబోతున్నారు. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేలా కారు ఇంటీరియర్ డిజైన్‌ను రెనాల్ట్ తీర్చిదిద్దింది.

నమ్మకమైన పాత ఇంజన్ కాంబినేషన్

ఫీచర్లు, లుక్స్ పరంగా పెద్ద మార్పులు చేసినప్పటికీ, కారు ఇంజన్ విషయంలో మాత్రం రెనాల్ట్ ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నమ్మకమైన 1.0-లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోనూ కొనసాగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బీహెచ్‌పీ (BHP) పవర్‌ను, 96 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

దశాబ్ద కాలంగా భారత్‌లో క్విడ్ ప్రస్థానం

భారతదేశంలో రెనాల్ట్ కంపెనీకి చెందిన అత్యంత చౌకైన, మైలేజ్ ఫ్రెండ్లీ కారుగా క్విడ్‌కు మంచి గుర్తింపు ఉంది. దాదాపు పదేళ్లకు పైగా భారతీయ రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడుస్తోంది. రెనాల్ట్ కంపెనీ ఇప్పటికే మన దేశంలో నెక్స్ట్ జనరేషన్ డస్టర్ కారును లాంచ్ చేయగా, దాని 7-సీటర్ వేరియంట్‌ను కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తమ బడ్జెట్ సెగ్మెంట్‌ను బలోపేతం చేయడానికి క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను రంగంలోకి దించుతోంది.

మారుతి, టాటా కార్లకు గట్టి పోటీ

ఈ సరికొత్త రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ అయిన తర్వాత.. ప్రస్తుతం దేశీయంగా మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సెలెరియో, టాటా టియాగో వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. సరికొత్త లుక్, డిజిటల్ ఫీచర్ల కారణంగా బడ్జెట్ లో కార్ కొనాలనుకునే యువతను ఈ కొత్త క్విడ్ బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News