Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్లకు పండగే.. షోరూమ్‌లకు చేరిన 2026 కాంటినెంటల్ జీటీ 650
2026 కాంటినెంటల్ జీటీ 650
Royal Enfield:ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ కేఫ్ రేసర్ మోడల్ కాంటినెంటల్ జీటీ 650 కొత్త 2026 వర్షన్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ మార్పులు, ఆధునిక ఫీచర్లతో రూపొందిన ఈ కొత్త బైక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లకు చేరుకోవడం విశేషం. 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 మోడల్‌ను గతంలో కంటే మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొత్త బైక్‌లో నల్లటి ఫినిషింగ్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కౌల్ ఇచ్చారు. ఇది కేఫ్ రేసర్ డిజైన్‌కు సరికొత్త రూపునిచ్చింది. ఇదివరకు ఉన్న ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో పాటు గుండ్రటి ఆకారంలో ఉండే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను కూడా జతచేశారు. లాంగ్ రైడింగ్ చేసే బైకర్ల సౌకర్యార్థం ప్రయాణంలో ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఫాస్ట్ టైప్-సి యుఎస్‌బి ఛార్జర్‌ను కూడా కొత్తగా అమర్చారు.
అద్భుతమైన కలర్ ఆప్షన్లు, అలాయ్ వీల్స్
కంపెనీ ఈసారి సరికొత్త రాకర్ రెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రాకర్ రెడ్, ఎపెక్స్ గ్రే రంగుల్లో వచ్చే మోడళ్లు పూర్తి బ్లాక్ థీమ్‌తో అలరిస్తాయి. వీటిలో ఇంజిన్ భాగంతో పాటు ఎగ్జాస్ట్ పైపులు కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో వస్తాయి. ఈ రెండు మోడళ్లలో అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించడం గమనార్హం. మరోవైపు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, క్రోమ్ ఫినిషింగ్ కలిగిన మిస్టర్ క్లీన్ వేరియంట్లు క్లాసిక్ పాలిష్ చేసిన ఇంజిన్, పాతకాలపు రెట్రో స్టైల్ వైర్-స్పోక్ వీల్స్‌తో దర్శనమిస్తాయి.
హార్డ్‌వేర్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్
ఈ బైక్‌లో 18 అంగుళాల చక్రాలు అమర్చారు. రైడర్ల సౌలభ్యం కోసం అడ్జస్టబుల్ లీవర్లు, సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్లను అందించారు. మెరుగైన బ్రేకింగ్ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. పవర్ విషయానికొస్తే, ఇందులో ఉన్న 648సిసి ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ 47.4 బిహెచ్‌పి పవర్, 52.3 ఎన్ఎమ్ టాపిక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ జోడించారు.
రూ. 3,58,427 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తున్న ఈ మోడల్ దేశంలోనే అత్యంత చౌకైన, బెస్ట్ ట్విన్-సిలిండర్ బైక్‌గా నిలుస్తోంది. సరికొత్త హంగులతో వచ్చిన ఈ కాంటినెంటల్ జీటీ 650 బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.