Royal Enfield : కొండలైనా..కోనలైనా..దూసుకుపోవాల్సిందే..రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అదిరిపోయే అప్‌డేట్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అదిరిపోయే అప్‌డేట్
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం 350 సీసీ బైకులు మాత్రమే కాదు.. అంతకు మించిన పవర్‌ఫుల్ మెషీన్లు కూడా ఉన్నాయని నిరూపించేందుకు కంపెనీ సిద్ధమైంది. అడ్వెంచర్ ప్రియుల కలల బైక్ హిమాలయన్ 411కు వారసురాలిగా, మరింత పవర్‌తో హిమాలయన్ 450 మార్కెట్లో సందడి చేస్తోంది. సరికొత్త డిజైన్, పవర్ఫుల్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ధరలు, ఈఎంఐ వివరాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చరిత్రలో తొలిసారిగా లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో ప్రవేశపెట్టింది. దీనికి షెర్పా 450 అని పేరు పెట్టింది. 452 సీసీ సామర్థ్యం గల ఈ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 39.5 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ ఉండటంతో గేర్లు మార్చడం చాలా సులభంగా ఉంటుంది. ట్విన్-స్పార్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మించిన ఈ బైక్, ఎంతటి కఠినమైన దారుల్లోనైనా స్థిరంగా ప్రయాణిస్తుంది.
ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
పాత హిమాలయన్ తో పోలిస్తే ఇందులో టెక్నాలజీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. 4-ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది, దాంతో మీరు గూగుల్ మ్యాప్స్ ను నేరుగా బైక్ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలతో పాటు ఎకో, పెర్ఫార్మెన్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఆఫ్-రోడింగ్ చేసే వారికి ఇబ్బంది లేకుండా స్విచబుల్ ఏబీఎస్ సౌకర్యం కూడా ఉంది. టెయిల్ ల్యాంప్ లోనే ఎల్‌ఈడీ ఇండికేటర్లు అమర్చడం ఈ బైక్ కు ఒక కొత్త లుక్ ఇచ్చింది.
ధర, ఈఎంఐ వివరాలు
హిమాలయన్ 450 ధరలు రంగును బట్టి రూ.3,05,736 నుంచి రూ.3,37,036 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ (రూ.3.37 లక్షలు) పై 100% లోన్ తీసుకుంటే, 9.5% వడ్డీ రేటుతో ఈఎంఐ లెక్కలు ఇలా ఉంటాయి:
12 నెలల కాలపరిమితి: నెలకు సుమారు రూ. 29,553 కట్టాలి.
24 నెలల కాలపరిమితి: నెలకు సుమారు రూ. 15,475 చెల్లించాలి.
36 నెలల కాలపరిమితి: నెలకు కేవలం రూ. 10,796 తో ఈ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు.
వాయిదాల పద్ధతి కాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ భారం తగ్గుతుంది.
కలర్ ఆప్షన్లు
ఈ బైక్ ఒకే వేరియంట్లో లభిస్తున్నప్పటికీ, రంగుల విషయంలో మాత్రం కంపెనీ చాలా ఆప్షన్లు ఇచ్చింది. కాజా బ్రౌన్, స్లేట్ హిమాలయన్ సాల్ట్ , స్లేట్ పాపీ బ్లూ, కామెట్ వైట్, హాన్లే బ్లాక్ రంగులతో పాటు కొత్తగా మన బ్లాక్ కలర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఒక్కో రంగు బైక్ కు ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది.