Royal Enfield : మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సునామీ.. ఒక్కటి కాదు మార్కెట్లోకి ఏకంగా డజను కొత్త బైకులు

ఒక్కటి కాదు మార్కెట్లోకి ఏకంగా డజను కొత్త బైకులు

Update: 2026-05-12 14:46 GMT

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే ఒక రాయల్టీ.. ఒక క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్‌ను డబుల్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో తన బైకుల లైనప్‌ను పూర్తిగా మార్చేయడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైన 750cc ఇంజిన్‌తో కొత్త బైకులను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కేవలం పెట్రోల్ బైకులే కాకుండా, సైలెంట్ పవర్‎తో ఎలక్ట్రిక్ బైకులను కూడా సిద్ధం చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 2026-27 సంవత్సరాల్లో ఎన్‌ఫీల్డ్ నుంచి రాబోతున్న ఆ అదిరిపోయే మోడళ్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

హిమాలయన్‌కు కొత్త జవసత్వాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న 750cc ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో వస్తున్న మొట్టమొదటి బైక్ హిమాలయన్ 750. ఇది అడ్వెంచర్ ప్రియులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. దీనితో పాటు పెద్ద సైజులో ఉండే కాంటినెంటల్ జీటీ పై కూడా కంపెనీ కసరత్తు చేస్తోంది. అయితే కొత్త 750cc మోడల్ వచ్చినా, పాత 650cc కాంటినెంటల్ జీటీ అమ్మకాలు మాత్రం కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. వచ్చే దశాబ్ద కాలంలో ఈ 750cc మోడళ్లే రాయల్ ఎన్‌ఫీల్డ్ కి అత్యంత ప్రీమియం బైకులుగా నిలవబోతున్నాయి.

బుల్లెట్ 650 వచ్చేస్తోంది

వింటేజ్ లుక్ ఇష్టపడే వారి కోసం బుల్లెట్ 650 త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 2025 EICMA మోటార్ షోలో దీనిని ప్రదర్శించగా, అప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో 648cc ఇంజిన్ ఉంటుంది, ఇది 47bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ బైక్, క్లాసిక్ లవర్స్‌కి పండగే అని చెప్పాలి. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న 650 ట్విన్ బైకులను కూడా అప్‌డేట్ చేస్తూ, మెరుగైన సస్పెన్షన్ మరియు ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను కంపెనీ జోడిస్తోంది.

హిమాలయన్ 440

ఖరీదైన హిమాలయన్ 450ని కొనలేకపోయేవారి కోసం స్కామ్ 440 ఆధారంగా రూపొందుతున్న హిమాలయన్ 440 ఒక గొప్ప ప్రత్యామ్నాయం కానుంది. దీని ధర సుమారు రూ.2.5 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ రేంజ్‌లో అడ్వెంచర్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే 450cc షెర్పా ప్లాట్‌ఫామ్‌పై కొత్త స్క్రాంబ్లర్ బైక్‌ను కూడా తయారు చేస్తున్నారు. ఇది 2027 నాటికి హై సస్పెన్షన్ మరియు ఆఫ్-రోడింగ్ టైర్లతో రోడ్లపైకి రానుంది.

ఎలక్ట్రిక్ రంగంలో ఫ్లయింగ్ ఫ్లీ హవా

మారుతున్న కాలానికి అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్లయింగ్ ఫ్లీ C6ను పరిచయం చేసిన కంపెనీ, ఇప్పుడు S6 స్క్రాంబ్లర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. ఇది 2027 ప్రారంభం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్ అయినప్పటికీ, ఎన్‌ఫీల్డ్ మార్కు రఫ్-అండ్-టఫ్ లుక్ మాత్రం పోదు. మరోవైపు, ఎలక్ట్రిక్ హిమాలయన్‌ను కూడా భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News