Hyundai Cars : కొత్త కారు కొంటున్నారా? రూ.85,000 డిస్కౌంట్..హ్యుందాయ్ బంపర్ ఆఫర్!
హ్యుందాయ్ బంపర్ ఆఫర్!;
Hyundai Cars : కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన వినియోగదారులకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ. 85,000 వరకు తగ్గింపుతో నచ్చిన హ్యాచ్‌బ్యాక్ లేదా ఎస్‌యూవీని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. హ్యుందాయ్ ఐ20, ఎక్స్టర్, వెన్యూ, మరియు గ్రాండ్ ఐ10 నియోస్ వంటి పాపులర్ మోడళ్లపై ఈ బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఇతర ప్రయోజనాలతో, ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని మీ కొత్త కారు కొనుగోలు చేసుకోండి
హ్యుందాయ్ అందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్లు మోడల్‌ను బట్టి మారుతుంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter): టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 55,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 10.43 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకునే ఈ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా రూ. 55,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్ వేరియంట్ రూ. 11.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue): హ్యుందాయ్ వెన్యూ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. 85,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ. 7.94 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 13.62 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS): ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై మీరు రూ. 65,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.98 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ. 8.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఈ డిస్కౌంట్ ఆఫర్లు వివిధ రాష్ట్రాలలో, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి, మీ ప్రాంతంలో ఏ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుందో ఖచ్చితమైన సమాచారం కోసం వెంటనే మీ దగ్గర్లోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి.