Mahindra Vision S : రెండు కళ్లు చాలట్లేదు.. మహీంద్రా కొత్త SUV లుక్ అదిరిపోయిందిగా

మహీంద్రా కొత్త SUV లుక్ అదిరిపోయిందిగా

Update: 2026-03-07 10:05 GMT

Mahindra Vision S : గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం వేళ మహీంద్రా కంపెనీ తన అమ్ముల పొది నుంచి విజన్ S అనే కాన్సెప్ట్ కారును ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కారు కేవలం కాన్సెప్ట్ స్టేజ్ దాటి, ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ఇటీవల భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో ఈ కారు కనిపించడంతో ఆటోమొబైల్ ప్రేమికుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఇది చూడటానికి అచ్చం స్కార్పియో లాగే బలంగా, మొండిగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది 4 మీటర్ల లోపు పొడవు ఉండే కాంపాక్ట్ SUV కావడం విశేషం. అంటే తక్కువ ధరలో స్కార్పియో రేంజ్ ఫీలింగ్‌ను ఇది అందించబోతోంది.

ఈ కారు డిజైన్ విషయానికి వస్తే, మహీంద్రా తన కొత్త సిగ్నేచర్ స్టైల్‌ను ఇందులో ప్రదర్శించింది. ముందు భాగంలో నిలువుగా ఉండే గ్రిల్స్, పదునైన ఎల్ఈడీ డిఆర్ఎల్స్ తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. అలాగే కారు వెనుక భాగంలో టెయిల్ గేట్ పై అమర్చిన స్పేర్ వీల్, L-ఆకారపు టెయిల్ లైట్లు దీనికి పక్కా ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చాయి. భారీ బంపర్లు, స్కిడ్ ప్లేట్లు దీనిని రోడ్లపై ఒక రౌడీలా కనిపించేలా చేస్తాయి.

ఇంటీరియర్ పరంగా కూడా మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కల అయిన పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను ఈ సెగ్మెంట్ లోనే తొలిసారిగా అందించే అవకాశం కనిపిస్తోంది. లోపల డ్యాష్ బోర్డ్ డిజైన్ చాలా క్లాసీగా ఉంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ చూస్తుంటే ఇది బడ్జెట్ వినియోగదారులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని అర్థమవుతోంది. సీట్లు కూడా చాలా కంఫర్ట్‌గా, ప్రీమియం ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో మహీంద్రా XUV 3XOలో వాడిన శక్తివంతమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చబోతున్నట్లు సమాచారం. ఇది సుమారు 117 BHP పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీ రోడ్లపైనే కాదు, ఎత్తుపల్లాల బాటలో కూడా ఈ కారు దూసుకుపోతుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో రాబోతున్న ఈ కారు.. మైలేజ్ విషయంలో కూడా మంచి పోటీని ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News