Skoda Kylaq: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో యూరోపియన్ కార్ల తయారీ సంస్థ స్కోడా వాహనాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గడిచిన సెప్టెంబర్ 2026 నెలలో కంపెనీ సాధించిన మోడల్ వారీగా విక్రయాలను పరిశీలిస్తే, స్కోడా కైలాక్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ నెలలో ఏకంగా 4,126 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 4,398 యూనిట్లుగా ఉండేది. మార్కెట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ కైలాక్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

ఇతర స్కోడా మోడళ్ల పనితీరు ఎలా ఉంది?

కైలాక్ తర్వాత స్థానంలో స్కోడా కుషాక్ నిలిచింది. కుషాక్ విక్రయాలు ఏకంగా 50 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి మొత్తం 1,152 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో కేవలం 769 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం గమనార్హం. ఇక స్కోడా స్లావియా విషయానికి వస్తే, 709 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. లగ్జరీ విభాగంలో స్కోడా కోడియాక్ 98 యూనిట్లు, ఆక్టావియా 17 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా సెప్టెంబర్ 2026లో స్కోడా బ్రాండ్ అండర్‌లోని అన్ని మోడల్స్ కలిపి మొత్తం 6,102 వాహనాలను విక్రయించింది.

అద్భుతమైన డిజైన్, ధరల వివరాలు

కంపెనీ బెస్ట్ సెల్లింగ్ కార్ అయిన స్కోడా కైలాక్ ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బాడీ కలెర్డ్ ORVMలు, డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, 16 అంగుళాల స్టీల్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. భారత మార్కెట్లో ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.59 లక్షల నుంచి టాప్ మోడల్‌కు రూ.13.09 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే యూరోపియన్ కారు కావడంతో మధ్యతరగతి ప్రజలు దీన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఇంజిన్ పవర్

భద్రత విషయంలో స్కోడా కైలాక్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ ఎస్‌యూవీకి భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. కేబిన్ లోపల హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జ్‌స్ట్‌మెంట్, సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 114 bhp పవర్‌ను, 178 Nm టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో ఇది టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Tags: