Tata Sierra : మహిళా క్రికెటర్లకు వరల్డ్ కప్ స్పెషల్ గిఫ్ట్.. టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎస్యూవీ

టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఎస్యూవీ

Update: 2025-11-06 07:58 GMT

Tata Sierra : ప్రపంచకప్ 2025లో చారిత్రక విజయాన్ని అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులకు అరుదైన గౌరవం దక్కింది. వారి అసాధారణ ప్రదర్శన, చారిత్రక విజయాన్ని సన్మానిస్తూ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఒక ప్రత్యేకమైన బహుమతిని ప్రకటించింది. ఈ విజేత జట్టులోని ప్రతి క్రీడాకారిణికి, తమ త్వరలో రాబోతున్న టాటా సియెరా ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

టాటా మోటార్స్, ప్రపంచకప్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసి, ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్పు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేక గౌరవం ప్రకటించింది. ఈ చారిత్రక విజయాన్ని సన్మానించడానికి, కంపెనీ తమ కొత్త టాటా సియెరా ఎస్‌యూవీని జట్టులోని ప్రతి క్రీడాకారిణికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ 16 మంది సభ్యుల బృందంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్, రాధా యాదవ్ వంటి స్టార్ క్రీడాకారిణులు ఉన్నారు. బహుమతిగా ఇవ్వనున్న ఈ కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ నవంబర్ 25న మార్కెట్‌లోకి రానుంది. ఈ కారు టాటా అత్యంత అడ్వాన్సుడ్ మోడల్‌గా పేరు తెచ్చుకోనుంది. టాటా సియెరా లాంచ్ నవంబర్ 25న జరగనుంది.

ఇది ఆకర్షణీయమైన ఆధునిక డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లతో వస్తుంది. కొత్త సియెరాలో మూడు డిజిటల్ స్క్రీన్‌లు (ట్రిపుల్ స్క్రీన్ సెటప్), అద్భుతమైన సీటింగ్ కంఫర్ట్, డ్రైవింగ్‌ను ఈజీ చేసే అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రపంచకప్ గెలిచిన ప్రతి క్రీడాకారిణికి సియెరా టాప్-ఎండ్ వేరియంట్‌ను బహుమతిగా ఇవ్వనున్నారు. టాటా మోటార్స్ ఈ సందర్భంగా క్రీడాకారిణుల కృషిని, దేశానికి వారు తెచ్చిన కీర్తిని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Tags:    

Similar News