Tata Motors: కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ ఆగస్టు నెలలో మైండ్ బ్లాకింగ్ ఆఫర్లు ప్రకటించింది. తన పాపులర్ పెట్రోల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. ముఖ్యంగా కర్వ్ ఈవీ మోడల్‌పై ఏకంగా రూ.3.5 లక్షల వరకు లబ్ధి పొందే సువర్ణావకాశం కల్పిస్తోంది. ఆగస్టు నెలలో వాహన కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, రోయల్టీ రివార్డుల రూపంలో ఈ ఆఫర్లు అందిస్తోంది. విద్యుత్ వాహనాల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మై2025 స్టాక్‌కు చెందిన కర్వ్ ఈవీ మోడల్‌పై అత్యధికంగా రూ.3.5 లక్షలకు పైగా మొత్తం లబ్ధి చేకూరనుంది. ఇది ఈ నెలలోనే అతిపెద్ద ఆఫర్‌గా నిలిచింది.

హ్యాచ్‌బ్యాక్, సబ్‌కాంపాక్ట్ మోడళ్లపై ఆఫర్ల మేళా

చిన్న కార్లను ఇష్టపడే వారి కోసం టియాగో ఈవీ, పంచ్ ఈవీల పాత స్టాక్‌పై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలను డీలర్లు అందిస్తున్నారు. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ తియాగో పెట్రోల్, టిగోర్ మోడళ్లపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లేదా రూ.15,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తోంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో కొన్ని వేరియంట్లపై రూ.5,000 అదనపు ఫ్రీడమ్ సెలబ్రేషన్ బోనస్ కూడా లభిస్తోంది. అల్ట్రోజ్ కారుపై రూ.35,000 క్యాష్ బెనిఫిట్, రూ.15,000 ఎక్స్చేంజ్ సపోర్ట్, రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనాలు లభిస్తున్నాయి.

పాపులర్ ఎస్‌యూవీలపై పండగ ఆఫర్లు

టాటా పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్ పెట్రోల్/డీజిల్ వెర్షన్‌పై ఈ నెల రూ.55,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్చేంజ్ సపోర్ట్, రూ.20,000 వరకు స్క్రాపేజ్ లబ్ధి లభిస్తోంది. నెక్సాన్ ఈవీపై రూ.45,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. కర్వ్ ఐసిఈ మోడల్‌పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.45,000 స్క్రాపేజ్ ప్రయోజనం, రూ.50,000 రాయల్టీ బోనస్ లభిస్తున్నాయి. సియెర్రా ఐసిఈ ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 30,000 వరకు లబ్ధి పొందే వీలుంది.

హారియర్, సఫారీ కార్లపై రూ.లక్ష వరకు ఆదా

హారియర్, సఫారీ మోడళ్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తోంది. ఇక హారియర్ ఈవీ విషయానికి వస్తే రూ.లక్ష వరకు ఫ్రీడమ్ సెలబ్రేషన్ ఆఫర్, రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.75,000 వరకు స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. పాత టాటా ఈవీ వాహనదారులు కొత్తగా కొనుగోలు చేస్తే రూ.లక్ష వరకు రాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. టాటా గ్రూప్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags: