Tata Harrier : హారియర్ కొనేవారికి పండగే..ఏకంగా రూ.1.25 లక్షల భారీ తగ్గింపు
ఏకంగా రూ.1.25 లక్షల భారీ తగ్గింపు
Tata Harrier : కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలో కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ ఎస్‌యూవీ టాటా హారియర్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. డిసెంబర్ నెలను మించి, జనవరిలో ఏకంగా రూ.1.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఒకవైపు ప్రస్తుత మోడల్‌పై ఆఫర్లు ఇస్తూనే, మరోవైపు సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నెక్స్ట్ జనరేషన్ హారియర్ పనులను కూడా టాటా ముమ్మరం చేసింది.
టాటా మోటార్స్ జనవరి 2026 నెలకు గాను హారియర్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా 2025 మోడల్ ఇయర్ స్టాక్‌పై గరిష్టంగా రూ. 1.25 లక్షల వరకు లబ్ధి పొందవచ్చు. క్రితం నెలలో రూ.లక్షగా ఉన్న ఈ డిస్కౌంట్ ఇప్పుడు మరింత పెరగడం విశేషం. హారియర్ ప్రారంభ ధర రూ.14 లక్షల నుండి రూ.25.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ప్రీమియం ఎస్‌యూవీని తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.
ప్రస్తుత హారియర్ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్‌ఫామ్ ఆధారిత ఒమేగా ఆర్కిటెక్చర్‌పై నడుస్తోంది. అయితే ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) లేకపోవడం ఒక లోటుగా ఉండేది. దీనిని భర్తీ చేస్తూ టాటా మోటార్స్ టారస్ అనే కోడ్ నేమ్‌తో సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై సెకండ్ జనరేషన్ హారియర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ కొత్త మోడల్ కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, AWD టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త ప్లాట్‌ఫామ్ వల్ల ఈ కారు ఇప్పుడున్న మోడల్ కంటే పొడవుగా ఉండటమే కాకుండా, లోపల స్థలం కూడా చాలా విశాలంగా ఉంటుంది.
హారియర్ ప్రస్తుతం 170hp పవర్ ఇచ్చే 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్-2 అడాస్ (ADAS), డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వాయిస్ కమాండ్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. రాబోయే టారస్ మోడల్‌లో టాటా మోటార్స్ సొంతంగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.