Tata Nexon: కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. టాటా నెక్సాన్ ఎంపిక చేసిన పెట్రోల్-మ్యాన్యువల్ మోడళ్లపై కంపెనీ గరిష్టంగా రూ.75,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. స్మార్ట్+, స్మార్ట్+ పిఎస్, ప్యూర్ ఎస్, ప్యూర్+, ప్యూర్+ ఎస్, ప్యూర్+ పిఎస్ వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.10,000 నేరుగా నగదు తగ్గింపు రూపంలో, రూ.45,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ కింద, మరో రూ.20,000 స్క్ర్యాపేజ్ బోనస్ రూపంలో వినియోగదారులకు లభిస్తున్నాయి. మిగిలిన పెట్రోల్ మోడళ్లపై కూడా మొత్తం రూ.55,000 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించారు.

సిఎన్‌జి, డీజిల్ మోడళ్లలోనూ అదిరిపోయే తగ్గింపులు

ఇంధన పొదుపును కోరుకునే కస్టమర్ల కోసం సీఎన్జీ, డీజిల్ మోడళ్లపై సైతం ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ సిఎన్‌జి వేరియంట్ కొనుగోలుపై మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.25,000 స్క్ర్యాపేజ్ బోనస్ కలిసి ఉన్నాయి. డీజిల్ వెర్షన్ ఆశించే వారికి రూ.20,000 స్క్ర్యాపేజ్ బోనస్ ప్రత్యేకంగా లభిస్తోంది. పాత వాహనాన్ని స్క్ర్యాప్ చేసే నిబంధనలకు లోబడి ఈ బోనస్ వర్తిస్తుందని గమనించాలి.

బలమైన ఇంజిన్.. అద్భుతమైన పర్ఫామెన్స్

టాటా నెక్సాన్ సామర్థ్యం విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అనిపిస్తుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 120 హెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ టాార్క్ ఇస్తుంది. రెండవది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 115 హెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టాార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటిలోనూ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు ప్యాడల్ షిఫ్టర్లు కూడా లభిస్తున్నాయి.

ధరలు, మార్కెట్ పోటీ వివరాలు

ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.40 లక్షలు ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.17.14 లక్షల వరకు ఉంది. ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి మోడళ్లతో నెక్సాన్ నేరుగా పోటీపడుతోంది. అయితే వేరియంట్‌ను బట్టి ఈ డిస్కౌంట్ మొత్తాలు మారే అవకాశం ఉన్నందున, కొనుగోలుకు ముందు సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించి తుది ధర తెలుసుకోవడం మంచిది.

Tags: