Tata Punch : మళ్ళీ పంచ్ అదిరింది..రూ.5.49 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీ

రూ.5.49 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీ

Update: 2026-01-03 14:02 GMT

Tata Punch : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా టాటా పంచ్ నామస్మరణే వినిపిస్తోంది. మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన ఈ మైక్రో ఎస్‌యూవీ, 2025 ఏడాదిని ఘనంగా ముగించింది. కేవలం తక్కువ ధరకే లభించడమే కాకుండా, భద్రతలో రాజీ పడకపోవడంతో కస్టమర్లు ఈ కారుపై కాసుల వర్షం కురిపిస్తున్నారు. గడచిన ఏడాదిలో ఏకంగా 1.73 లక్షల యూనిట్లు అమ్ముడై, తన విభాగంలో తిరుగులేని విజేతగా నిలిచింది.

టాటా పంచ్ విజయానికి ప్రధాన కారణం దాని బోల్డ్, మస్కులర్ డిజైన్. చూడ్డానికి పెద్ద ఎస్‌యూవీలా కనిపించినా, సిటీ రోడ్లపై నడపడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల గుంతల రోడ్ల మీద కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. అందుకే అటు పట్నం జనం, ఇటు పల్లెటూరి జనం ఇద్దరికీ ఈ కారు హాట్ ఫేవరెట్ అయిపోయింది. చిన్న ఫ్యామిలీలకు ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీలా నిలుస్తోంది.

సాధారణంగా తక్కువ బడ్జెట్ కార్లలో సేఫ్టీ తక్కువగా ఉంటుందనే అపవాదు ఉంది. కానీ టాటా పంచ్ ఆ అపవాదును చెరిపేసింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, బలమైన బాడీ స్ట్రక్చర్, స్టాబిలిటీ ఫీచర్లతో ప్రాణాలకు భరోసా ఇస్తోంది. తమ కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే ప్రతి ఒక్కరూ ఇప్పుడు గుడ్డిగా టాటా పంచ్‌ను ఎంచుకుంటున్నారు.

ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు కావాల్సిన పవర్‌ను ఇస్తూనే, మంచి మైలేజీని కూడా అందిస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉండటంతో, మొదటిసారి కారు కొనేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాటా బ్రాండ్ మీద ఉన్న నమ్మకం కూడా ఈ అమ్మకాల పెరుగుదలకు తోడైంది.

2025 ఏడాదిలో మొత్తం 1.73 లక్షల మంది కస్టమర్లు టాటా పంచ్‌ను తమ ఇంటికి తీసుకెళ్లారు. దీని ప్రారంభ ధర రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కావడమే దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర పోటీదారులను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

Tags:    

Similar News