Tata Punch EV : ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్లొచ్చు.. పిల్లలు, పెద్దల రక్షణలో టాప్‌లేపిన టాటా పంచ్ EV
టాప్‌లేపిన టాటా పంచ్ EV
Tata Punch EV : భారతీయ వాహనదారులకు సేఫ్టీ అనగానే మొదటగా గుర్తుకువచ్చే బ్రాండ్ టాటా మోటార్స్. తన ప్రాచుర్యం పొందిన చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో కంపెనీ రక్షణ విభాగంలో మరొకసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అత్యంత కఠినమైన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ చిన్న ఈవీ కార్ ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. దీంతో మార్కెట్‌లో లభించే అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా పంచ్ ఈవీ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ క్రాష్ టెస్ట్ లెక్కింపుల్లో పంచ్ ఈవీ తన అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో అందరినీ ఆకట్టుకుంది. పెద్దల రక్షణ విభాగంలో ఈ కారు 32 మార్కులకు గాను ఏకంగా 31.09 మార్కులను సాధించింది. ఇక పిల్లల భద్రత విషయంలో 49 మార్కులకు గాను 45 మార్కులు పొంది సంచలనం సృష్టించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో 16 కి 15.28 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 15.80 పాయింట్లు సాధించింది. క్లిష్టమైన సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లోనూ బాడీ షెల్ బలంగా నిలబడి ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించింది.
ఈ కార్‌లోని అత్యంత ప్రశంసనీయమైన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ 5-స్టార్ సేఫ్టీ ఫీచర్లను కేవలం ఖరీదైన టాప్-ఎండ్ మోడల్‌కే పరిమితం చేయలేదు. కారు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్నింటిలోనూ ఒకే రకమైన భద్రతా ప్రమాణాలను అందించారు. దీనివల్ల తక్కువ బడ్జెట్‌లో ప్రాథమిక మోడల్ కొనుగోలు చేసే కస్టమర్‌కి కూడా 5-స్టార్ స్థాయి భద్రతే లభిస్తుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది ఎంతో ధైర్యాన్నిచ్చే విషయమని చెప్పవచ్చు.
పంచ్ ఈవీలోని అన్ని వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, కాలినడకన వెళ్లేవారి రక్షణ ఫీచర్లు స్టాండర్డ్ గా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వ్యవస్థ, వెనుక సీట్లలో చిన్న పిల్లల సీట్లను అమర్చుకోవడానికి ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఇచ్చారు. చైల్డ్ రెస్ట్రయింట్ సిస్టమ్ (CRS) డైనమిక్ టెస్టుల్లో కూడా ఈ కారు పూర్తి మార్కులు సాధించడం విశేషం.
భారత్ NCAP సంస్థ పంచ్ ఈవీ మోడల్‌ను పరీక్షించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024 లో పరీక్షించిన పాత మోడల్‌తో పోలిస్తే అడల్ట్ సేఫ్టీ పాయింట్లలో స్వల్ప మార్పు వచ్చినప్పటికీ, పిల్లల సేఫ్టీ స్కోర్ ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా నిలిచింది. ఓవరాల్‌గా 5-స్టార్ రేటింగ్ సాధించడం ద్వారా, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ భద్రత కోరుకునే ఈవీ కస్టమర్లకు టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఒక తిరుగులేని అద్భుతమైన ఎంపికగా నిలిచింది.