Tata Punch Facelift 2026 : 13న వస్తున్న కొత్త టాటా పంచ్.. తొలిసారి టర్బో ఇంజన్‌తో కిర్రాక్ ఎంట్రీ

తొలిసారి టర్బో ఇంజన్‌తో కిర్రాక్ ఎంట్రీ

Update: 2026-01-05 05:11 GMT

Tata Punch Facelift 2026 : టాటా మోటార్స్ తన సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్‎ను సరికొత్త అవతారంలోకి మార్చేసింది. 2021లో లాంచ్ అయిన తర్వాత ఈ కారుకు జరుగుతున్న మొట్టమొదటి భారీ మార్పు ఇది. ఈ నేపథ్యంలో కంపెనీ వదులుతున్న ఒక్కో టీజర్ కారుపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ముఖ్యంగా ఈసారి కేవలం లుక్ మాత్రమే కాదు, ఇంజన్‌లో కూడా ఒక పెద్ద పంచ్ ఉండబోతోంది.

ఎస్‌యూవీ ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. ఇప్పటివరకు టాటా పంచ్‌లో కేవలం 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉండేది. కానీ జనవరి 13, 2026న లాంచ్ కాబోతున్న కొత్త పంచ్‌లో తొలిసారి టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేస్తున్నారు. ఇది ఆల్ట్రోజ్ రేసర్ మోడల్‌లో ఉన్నట్లుగా దాదాపు 120 PS పవర్, 170 Nm టార్క్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి తోడు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ రాబోతుండటంతో, హైవేలపై దూసుకుపోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూడ్డానికి దాదాపు పంచ్ ఈవీ లాగా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తోంది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, నిలువుగా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, షార్ప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. లోపలి భాగంలో 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సేఫ్టీకి మారుపేరైన టాటా, ఈసారి పంచ్‌లో సెగ్మెంట్లోనే లేని అద్భుతమైన ఫీచర్లను జోడిస్తోంది. టీజర్ ప్రకారం..ఇందులో 360-డిగ్రీ సరాండ్ వ్యూ కెమెరా రాబోతోంది. అంతేకాదు, చిన్న ఎస్‌యూవీ అయినప్పటికీ ఇందులో అడాస్ (ADAS - Level 2) టెక్నాలజీని కూడా ఇస్తున్నట్లు సమాచారం. అంటే లేన్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఈ చిన్న కారులో కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుత పంచ్ ధర రూ.5.50 లక్షల నుండి రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫీచర్లు, టర్బో ఇంజన్ రాకతో కొత్త మోడల్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 10.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఎక్స్‌టర్, నిస్సాన్ మ్యాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, తన సెగ్మెంట్‌లో మళ్ళీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

Tags:    

Similar News