Tata Punch : టాటా పంచ్ అసలు ధర ఎంత? టాక్స్ లేకపోతే ఈ కారు ఎంతకు దొరుకుతుందో తెలుసా?
టాక్స్ లేకపోతే ఈ కారు ఎంతకు దొరుకుతుందో తెలుసా?
Tata Punch : టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా పంచ్ ఎస్‌యూవీ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ను సృష్టిస్తోంది. ఈ కారు పాపులారిటీకి ముఖ్య కారణం దాని ధర, సేఫ్టీ. మధ్యతరగతి కుటుంబాలు కారు కొనడానికి ప్రధానంగా చూసేది ఈ రెండు అంశాలనే. టాటా పంచ్‌కు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కారు ధర దాదాపు రూ.6లక్షల రేంజ్‌లో మొదలవుతుంది. అయితే ఈ కారు కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్ లేకపోతే అప్పుడు దీని అసలు ధర ఎంత అవుతుందో తెలుసుకుందాం.
టాటా పంచ్ అసలు ధర ఎంత?
సాధారణంగా మనం కారు కొనాలంటే చెల్లించే ధరలో జీఎస్‌టీ, రోడ్డు ట్యాక్స్ వంటి అనేక రకాల టాక్స్‌లు కలిసి ఉంటాయి. టాటా పంచ్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,49,990. ఈ ఎక్స్-షోరూమ్ ధరలో కూడా కొన్ని రకాల పన్నులు కలిసి ఉంటాయి. అయితే కారు ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు దాని తయారీ ఖర్చు, కంపెనీ లాభం మాత్రమే కలిపి ఉంటుంది అనుకుంటే ఎక్స్-షోరూమ్ ధరనే దాని అసలు ధరగా పరిగణించవచ్చు.
కారు షోరూమ్ దాటి రోడ్డుపైకి వచ్చేసరికి దీనిపై జీఎస్‌టీ, రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇన్సూరెన్స్ వంటివి అన్నీ కలుస్తాయి. అందుకే, టాటా పంచ్ ధర బేస్ మోడల్‌కు రూ.5.50 లక్షల నుంచి టాప్ మోడల్‌కు దాదాపు రూ.9.30 లక్షల వరకు ఉంటుంది. టాటా పంచ్ మంచి ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5-సీటర్ ఎస్‌యూవీ. మార్కెట్‌లో మొత్తం 31 వేరియంట్లలో, ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది.
ఇందులో 1.2-లీటర్ రైవోట్రాన్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 87.8 PS పవర్‌ను, 3,150-3,350 rpm వద్ద 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ లభిస్తాయి. ఇది పెట్రోల్ పవర్‌ట్రైన్‌తో పాటు CNG వేరియంట్‌లో కూడా భారత మార్కెట్‌లో ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్లు. కారులో 26.03-సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.