Tata Sierra EV : టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం.. జూన్ 30న మార్కెట్లోకి సియెర్రా ఈవీ
జూన్ 30న మార్కెట్లోకి సియెర్రా ఈవీ
Tata Sierra EV : భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి టాటా మోటార్స్ సిద్ధమైంది. జూన్ 30న జరగబోయే అఫీషియల్ లాంచ్ ఈవెంట్ లో ఈ కారు ధరలు, ఫీచర్లను కంపెనీ పూర్తిగా వెల్లడించనుంది. అయితే అంతకంటే ముందే వచ్చిన లీకుల ప్రకారం.. ఈ కారు బేస్ వేరియంట్ అయిన Pure మోడల్‌లో 65kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చబోతున్నారు. ఇది టాటా హారియర్ ఈవీ నుంచి సేకరించిన పవర్‌ఫుల్ బ్యాటరీ కావడం విశేషం. సాధారణంగా టాటా హారియర్ ఈవీలో 65kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 65kWh బ్యాటరీతో వచ్చే రియర్-వీల్ డ్రైవ్ (RWD) మోటార్ సుమారు 238bhp పవర్‌ను, 315Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాటరీ సెటప్ సహాయంతో హారియర్ ఈవీ ఒకేసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 538 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే సేమ్ పవర్ ట్రెన్ సరికొత్త సియెర్రా ఈవీలోనూ రంగప్రవేశం చేయబోతోంది.
తక్కువ బరువుతో మరింత మెరుగైన రేంజ్
ఆటోమొబైల్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, టాటా సియెర్రా ఈవీ కారు హారియర్ ఈవీ కంటే పరిమాణంలో కాస్త చిన్నదిగా మరియు బరువులో చాలా తేలికగా ఉండబోతోంది. దీనివల్ల ఒకే రకమైన 65kWh బ్యాటరీని ఉపయోగించినప్పటికీ, హారియర్ కంటే సియెర్రా ఈవీలో మైలేజ్ లేదా రేంజ్ ఇంకాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే ఈవీ కార్ కావాలనుకునే వారికి ఈ బేస్ వేరియంట్ ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది.
టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్, పవర్‌ఫుల్ మోటార్
కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం, టాటా సియెర్రా ఈవీ హయ్యర్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) లేదా క్యూడబ్ల్యూడీ (QWD) డ్రైవ్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. దీని టాప్ మోడల్స్ లో పెద్దదైన 75kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు డ్యూయల్ మోటార్ సెటప్‌ను అందించనున్నారు. హారియర్ ఈవీలో ఇదే సెటప్ ఏకంగా 313bhp పవర్‌ను, 540Nm టార్క్‌ను అందిస్తూ.. ఒక్క ఛార్జ్‌పై దాదాపు 622 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇదే రేంజ్ సియెర్రా టాప్ మోడల్‌లోనూ ఆశించవచ్చు.
ట్రిపుల్ స్క్రీన్, అడ్వాన్స్డ్ లెవెల్-2 సేఫ్టీ ఫీచర్లు
డిజైన్ పరంగా ఈ కారు పాత ఐసీఈ (ఇంజన్) మోడల్ లాగే క్లాసిక్ లుక్‌ను కలిగి ఉన్నప్పటికీ, ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, సరికొత్త బంపర్, గ్లోసీ ఫినిషింగ్, మెరిసే 19-ఇంచుల అలాయ్ వీల్స్‌తో చాలా మోడరన్‌గా కనిపిస్తుంది. కారు లోపల లగ్జరీ ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో ఏకంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్, వెంటిలేటెడ్ పవర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ప్రీమియం ఆడియో సిస్టమ్, విభిన్న డ్రైవ్ మోడ్స్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ప్రమాదాలను ముందుగానే పసిగట్టే లెవెల్-2 అడాస్ (ADAS) లాంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.