Renault Duster : మార్చి 31లోపు బుక్ చేస్తే బంపర్ ఆఫర్.. రూ. 10.29 లక్షలకే కొత్త డస్టర్ సొంతం

రూ. 10.29 లక్షలకే కొత్త డస్టర్ సొంతం

Update: 2026-03-17 09:20 GMT

Renault Duster : భారతీయ ఎస్‌యూవీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న రెనాల్ట్ డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలో తిరిగి వచ్చింది. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ కొత్త తరం డస్టర్‌ను కంపెనీ నేడు అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.10.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. అయితే, ఆర్‌-పాస్ ద్వారా మార్చి 31, 2026 లోపు బుక్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేకంగా రూ.10.29 లక్షలకే ఈ కారు లభించనుంది. కేవలం రూ.21,000 చెల్లించి ఈ కారును ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ల డెలివరీ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుండగా, హైబ్రిడ్ వెర్షన్లు పండుగ సీజన్ నాటికి అందుబాటులోకి వస్తాయి.

కొత్త డస్టర్ ఇంజిన్ పరంగా మూడు విభిన్న ఆప్షన్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్లలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండగా, పవర్ కోరుకునే వారి కోసం 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్నింటికంటే ప్రత్యేకమైనది 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది ఎలక్ట్రిక్ మోటార్, 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనివల్ల నగరాల్లో ప్రయాణించేటప్పుడు 80 శాతం వరకు కేవలం ఈవీ మోడ్‌లోనే నడపవచ్చు, ఫలితంగా పెట్రోల్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

ఫీచర్ల విషయానికి వస్తే రెనాల్ట్ ఈసారి కారును ఒక ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్‌లా మార్చేసింది. లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ (గూగుల్ బిల్ట్-ఇన్), 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసేందుకు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా భౌతిక బటన్లను అలాగే ఉంచడం వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్స్ వాడటం చాలా సులభం అవుతుంది.

సేఫ్టీ విషయంలో రెనో రాజీ పడలేదు. ఈ కారులో ఏకంగా 35 అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడాస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. అలాగే 212 ఎన్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తుంది. లగేజీ కోసం ఏకంగా 700 లీటర్ల బూట్ స్పేస్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్పులకు వెళ్లే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. మొత్తం మీద కొత్త డస్టర్ తన పాత వైభవాన్ని మళ్ళీ సొంతం చేసుకోవడానికి సిద్ధమైపోయింది.

Tags:    

Similar News