Toyota Hyryder : ఒక్కసారి ట్యాంక్ నింపితే 1200 కి.మీ మైలేజ్..టయోటా హైరైడర్ అరాచకం
.టయోటా హైరైడర్ అరాచకం
Toyota Hyryder : టయోటా సంస్థ తన హైబ్రిడ్ టెక్నాలజీతో భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హైరైడర్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. 2025 డిసెంబర్ నెలలోనే సుమారు 7,022 మంది కస్టమర్లు ఈ కారును తమ సొంతం చేసుకున్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆగస్టు నెలలో ఏకంగా 9,000 యూనిట్లు అమ్ముడై తన సత్తా చాటిన ఈ కారు, ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
హైరైడర్ సక్సెస్‌కు ప్రధాన కారణం దాని మైలేజ్. ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్ సుమారు 21 కి.మీ మైలేజ్ ఇస్తుండగా, స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ ఏకంగా లీటరుకు 27.97 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇక సిఎన్జీ లవర్స్ కోసం కేజీకి 26.6 కి.మీ మైలేజ్ ఇచ్చే మోడల్ కూడా ఉంది. స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్‌లో ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి మళ్ళీ వెనక్కి రావడానికి ఒక్కసారి పెట్రోల్ కొట్టిస్తే సరిపోతుందన్నమాట.
లోపల కాలు పెడితే ఈ కారు చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సదుపాయం ఉంది. డ్రైవింగ్‌ను సులభతరం చేసేందుకు 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ద్వారా కారును మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. సిటీలో తిరగడానికి లేదా లాంగ్ ట్రిప్స్‌కు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి సేఫ్టీ చాలా ముఖ్యం. హైరైడర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి తోడు 360-డిగ్రీ కెమెరా ఉండటం వల్ల పార్కింగ్ చేయడం చాలా ఈజీ. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పిల్లల కోసం ISOFIX మౌంట్స్ ఉండటం వల్ల ఇది ఒక సురక్షితమైన ఫ్యామిలీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది.
టయోటా హైరైడర్ బేస్ మోడల్ ధర రూ.11.34 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ రూ.20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. సిఎన్జీ వేరియంట్ రూ.13.81 లక్షల నుంచి లభిస్తుంది. టయోటా ఇచ్చే నమ్మకమైన సర్వీస్, ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల వల్ల ఈ కారుకు మార్కెట్లో తిరుగులేకుండా పోయింది.