Toyota Innova Crysta : ఇన్నోవా క్రిస్టా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? డౌన్ పేమెంట్, లోన్ మొత్తం వివరాలివే

డౌన్ పేమెంట్, లోన్ మొత్తం వివరాలివే

Update: 2025-11-24 13:54 GMT

Toyota Innova Crysta : భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా ఒక అత్యంత నమ్మకమైన, విలాసవంతమైన కారు. ఇది 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఇన్నోవా క్రిస్టాలో అత్యంత చవకైన 7-సీటర్ మోడల్ ధర రూ.18.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు కొనడానికి మొత్తం డబ్బు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. మీరు కారు లోన్ తీసుకుని, నెలవారీ ఈఎంఐలు కడుతూ కూడా ఈ కారును సొంతం చేసుకోవచ్చు.

ఐదు సంవత్సరాల లోన్‌పై EMI ఎంత?

టయోటా ఇన్నోవా క్రిస్టా అత్యంత చవకైన మోడల్ (ధర రూ.18.66 లక్షలు) కొనడానికి అవసరమైన లోన్ వివరాలు కింద ఉన్నాయి. మీరు సుమారు రూ.1.87 లక్షల డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు సుమారు రూ.16.80 లక్షల వరకు లోన్ లభించవచ్చు. ఒకవేళ మీరు ఐదు సంవత్సరాల కాలానికి (60 నెలలు) లోన్ తీసుకుంటే, దానిపై 9 శాతం వడ్డీ వర్తిస్తే, మీరు ప్రతి నెలా రూ.34,850 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు డౌన్ పేమెంట్ ఇంకా ఎక్కువ కడితే నెలవారీ ఈఎంఐ మరింత తగ్గే అవకాశం ఉంది.

6, 7 సంవత్సరాల EMI ప్లాన్స్

మీ నెలవారీ ఈఎంఐ భారం తగ్గించుకోవాలనుకుంటే లోన్ కాలపరిమితిని పెంచుకోవచ్చు. మీరు ఆరు సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.30,259 ఈఎంఐ కట్టాలి. మీరు ఏడు సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.27,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

గమనిక: కారు కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల పాలసీలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి, అసలు లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు, ఇతర పత్రాలను పూర్తిగా చదవాలి. ఈ లెక్కల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

Tags:    

Similar News