Toyota : ఫార్చ్యూనర్ ప్రేమికులకు గుడ్‌న్యూస్.. రూ.20లక్షలకే టయోటా ఎఫ్‌జే క్రూజర్ వచ్చేస్తోంది

రూ.20లక్షలకే టయోటా ఎఫ్‌జే క్రూజర్ వచ్చేస్తోంది

Update: 2025-10-15 09:54 GMT

Toyota : ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపుతో భారత మార్కెట్‌లో పండుగ సందడి నెలకొంది. ఈ ఉత్సాహం మధ్య త్వరలో విడుదల కానున్న కార్లలో టయోటా మినీ ఫార్చ్యూనర్ ఒకటి. దీనిని బేబీ ల్యాండ్ క్రూజర్ లేదా టయోటా ఎఫ్‌జే క్రూజర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో మహీంద్రా థార్ రాక్స్, స్కార్పియో-N వంటి వాహనాలకు గట్టి పోటీనివ్వగలదు. ముఖ్యంగా ఫార్చ్యూనర్ (రూ.33.64 లక్షల) కంటే ఇది చవకగా లభిస్తుంది.

టయోటా ఎఫ్‌జే క్రూజర్ ఎక్స్-షోరూమ్ ధర భారతదేశంలో రూ.20 లక్షల నుంచి రూ.27 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ధర రూ.33.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే, మినీ ఫార్చ్యూనర్ దాని పెద్ద వెర్షన్ కంటే కనీసం రూ.13 లక్షల వరకు చవకగా లభించనుంది. ఫార్చ్యూనర్ తరహా డిజైన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వినియోగదారులకు మహీంద్రా స్కార్పియో-N, టాటా సఫారి, జీప్ కంపాస్‌లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

టయోటా ఎఫ్‌జే క్రూజర్ ఉత్పత్తి 2026 చివరి నాటికి థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో దీని లాంచింగ్ 2027 మధ్య నాటికి (జూన్ 2027) జరగవచ్చని అంచనా. ఈ ఎస్‌యూవీని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న మేక్ ఇన్ ఇండియా ప్లాంట్‌లో తయారు చేస్తారు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండి.. టయోటా దీనిని పోటీ ధరలలో ప్రవేశపెట్టేందుకు వీలవుతుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఎఫ్‌జే క్రూజర్ రఫ్-టఫ్, బాక్సీ షేపులో వస్తుంది. 2023లో విడుదలైన టీజర్ ఇమేజ్ ద్వారా ఇది స్పష్టమైంది. ఈ ఎస్‌యూవీలో ఆధునిక ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మందపాటి టైర్లు, టెయిల్‌గేట్‌కు అమర్చిన స్పేర్ వీల్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ దీనికి ఒక క్లాసిక్, స్ట్రాంగ్ ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తాయి. దీని 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ కచ్చా రోడ్లలో కూడా స్మూత్ డ్రైవింగ్ చేయడానికి వీలు ఉంటుంది.

టయోటా ఎఫ్‌జే క్రూజర్ భారతీయ వెర్షన్‌లో 2.7 లీటర్ 2TR-FE నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 161 బీహెచ్‌పీ పవర్, 246 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, ఫుల్-టైమ్ 4WD సిస్టమ్‌తో వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం టయోటా ఇందులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఇది మంచి మైలేజ్, పర్యావరణ అనుకూల డ్రైవింగ్‌కు తోడ్పడుతుంది.

Tags:    

Similar News