Triumph : బుల్లెట్ కోట పై ట్రయంఫ్ దండయాత్ర.. సరికొత్త 350cc బైకుల లాంచ్.. మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లు
సరికొత్త 350cc బైకుల లాంచ్.. మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లు
Triumph : భారత టూవీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన బ్రిటీష్ బైక్ బ్రాండ్ ట్రయంఫ్, ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తోంది. బజాజ్ ఆటో భాగస్వామ్యంతో ఇప్పటికే 400cc విభాగంలో దూసుకుపోతున్న ఈ కంపెనీ, ఇప్పుడు తన పరిధిని మరింత విస్తరిస్తూ సరికొత్త 350cc శ్రేణిని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ సరికొత్త బైకుల వివరాలు, వాటి పవర్, టార్క్, వేగానికి సంబంధించిన గణాంకాలు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి.
ట్రయంఫ్ T4 350
ట్రయంఫ్ శ్రేణిలో బేస్ మోడల్ గా వస్తున్న T4 ఇప్పుడు 350cc ఇంజిన్‌తో సందడి చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 400cc వేరియంట్ 31 PS పవర్, 36 Nm టార్క్‌ను ఇస్తుండగా, కొత్త 350cc T4 ఇంజిన్ 7,500 RPM వద్ద 29 PS పవర్, 5,500 RPM వద్ద 31 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 137 కిలోమీటర్లుగా ఉండనుంది.
స్పీడ్ 400 ఇప్పుడు 350cc వెర్షన్‌లో
ట్రయంఫ్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చిన స్పీడ్ 400 కూడా ఇప్పుడు 350cc వెర్షన్‌లో రాబోతోంది. ఈ కొత్త వెర్షన్ 8,500 RPM వద్ద 37 PS పవర్, 7,000 RPM వద్ద 32 Nm టార్క్‌ను అందిస్తుంది. వేగం విషయంలో కూడా ఇది తగ్గడం లేదు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.1 సెకన్లలోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 147 కిలోమీటర్లుగా ఉండబోతోంది.
థ్రక్స్టన్ 400
ఈ కొత్త శ్రేణిలో అత్యంత శక్తివంతమైన బైక్‌గా థ్రక్స్టన్ 400 నిలవనుంది. దీని 350cc వెర్షన్ 8,750 RPM వద్ద ఏకంగా 40 PS పవర్, 7,500 RPM వద్ద 32 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 8.3 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 157 కిలోమీటర్లుగా ఉండనుంది. స్పోర్టీ లుక్, హై-స్పీడ్ కోరుకునే యువతకు ఇది ఫేవరెట్ ఛాయిస్ కానుంది.
బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి?
ఈ 350cc శ్రేణిని తీసుకురావడానికి ప్రధాన కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడమే. 400cc బైకుల కంటే ఈ 350cc బైకుల ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మధ్యతరగతి బైక్ ప్రియులకు కూడా ట్రయంఫ్ బ్రాండ్ అందుబాటులోకి రానుంది.