Triumph : బైక్ లవర్స్‌కు షాక్..భారీగా పెరిగిన ట్రయంఫ్ 400 సిరీస్ ధరలు

భారీగా పెరిగిన ట్రయంఫ్ 400 సిరీస్ ధరలు

Update: 2026-06-01 09:46 GMT

Triumph : భారతీయ ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్లో తనదైన స్టైల్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్రిటీష్ బైక్ బ్రాండ్ ట్రయంఫ్ (Triumph) కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మన దేశంలో ఎంతో పాపులర్ అయిన తన 350సీసీ, 400సీసీ మోటార్‌సైకిల్ రేంజ్ ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. మోడల్‌ను బట్టి రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు ధరలను పెంచేసింది. ట్రయంఫ్లైనప్‌లో ఉన్న స్పీడ్ 400, స్పీడ్ టీ4, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ, థ్రక్స్టన్ 400 బైకులు ఇప్పుడు మునుపటి కంటే ప్రియం కానున్నాయి.

ధరల పెంపునకు గల కారణాలు ఏంటి?

ట్రయంఫ్లైనప్‌లోని నాలుగు మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. ముఖ్యంగా ట్రయంఫ్ స్పీడ్ టీ4 బైక్ లాంచ్ అయిన తర్వాత దాని ధర పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ట్రయంఫ్350సీసీ రేంజ్‌లో జీఎస్టీ 2.0 డౌన్‌సైజ్డ్ ప్లాట్‌ఫామ్ మార్పుల తాలూకు టాక్స్ బెనిఫిట్ లభించని ఏకైక మోడల్ ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. దీని ఫలితంగా, అప్‌డేట్ చేసిన 350సీసీ స్పీడ్ టీ4 ధర ఇప్పుడు కొన్ని నెలల క్రితం వరకు అందుబాటులో ఉన్న 399సీసీ వెర్షన్ కంటే ఎక్కువగా మారిపోయింది.

ఇంజన్ పవర్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

ఈ బైకులలో ట్రయంఫ్ సరికొత్త 350సీసీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినప్పటికీ, మోడల్‌ను బట్టి పవర్ అవుట్‌పుట్‌లో చిన్నపాటి తేడాలు ఉన్నాయి.

* స్పీడ్ టీ4: ఈ బైక్ 29 హెచ్‌పీ పవర్‌ను, 31 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. గతంలో ఉన్న 398.15 సీసీ ఇంజన్ 31 హెచ్‌పీ పవర్, 36 ఎన్ఎమ్ టార్క్‌ను ఇచ్చేది.

* స్పీడ్ 400 & స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌సీ: ఈ రెండు మోడళ్లు ఇప్పుడు 37 హెచ్‌పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తాయి. గతంలో ఇవి 40 హెచ్‌పీ పవర్, 37.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఇచ్చేవి.

* థ్రక్స్టన్ 400: ఈ సిరీస్‌లో టాప్ ఎండ్‌లో ఉండే థ్రక్స్టన్ 400 మోడల్ ఏకంగా 40 హెచ్‌పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఇటీవలే లాంచ్ అయిన ట్రాకర్ 400 పర్ఫార్మెన్స్‌కు సమానంగా ఉంటుంది.

డిజైన్, లగ్జరీ ఫీచర్లు అదరహో

ట్రయంఫ్400 సిరీస్ బైకులు మన దేశంలో ఇంతటి భారీ పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం వాటి ప్రీమియం డిజైన్, మతిపోయే లుక్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్. ధరలు పెరిగినప్పటికీ, ఈ బైకులు ఇచ్చే రైడింగ్ కంఫర్ట్, బ్రాండ్ వాల్యూ కారణంగా ఇప్పటికీ ఈ సెగ్మెంట్ లో ఇవి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. కాకపోతే, ఈ బైకులను సొంతం చేసుకోవాలనుకునే వారు ఇప్పుడు మునుపటి కంటే జేబుకు కొంచెం ఎక్కువ భారం వేసుకోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News