TVS : టూవీలర్ మార్కెట్లో సరికొత్త సంచలనం.. యమహా ఎరాక్స్‌కు పోటీగా టీవీఎస్ 160సీసీ మ్యాక్సీ స్కూటర్

యమహా ఎరాక్స్‌కు పోటీగా టీవీఎస్ 160సీసీ మ్యాక్సీ స్కూటర్

Update: 2026-06-08 06:11 GMT

TVS : భారతదేశంలో టూవీలర్ కస్టమర్ల ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం మైలేజ్ ఇచ్చే సాధారణ ఫ్యామిలీ స్కూటర్లకే పరిమితమైన జనాలు.. ఇప్పుడు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే స్టైల్ ఉండే ప్రీమియం స్కూటర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్పోర్టీ లుక్ మరియు లాంగ్ రైడింగ్‌కు పనికొచ్చే మ్యాక్సీ స్కూటర్ల డిమాండ్ మార్కెట్లో బాగా పెరిగింది. ఈ మారుతున్న ట్రెండ్‌ను ముందే గమనించిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ.. ప్రీమియం సెగ్మెంట్‌లో ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది.

యమహా ఎరాక్స్‌కు గట్టి పోటీ

యమహా ఎరాక్స్ 155, హీరో జూమ్ 160, త్వరలో రాబోతున్న హోండా ADV160 వంటి పవర్‌ఫుల్ స్కూటర్ల మార్కెట్‌ను దెబ్బకొట్టేందుకు టీవీఎస్ ఒక సరికొత్త 160సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ స్కూటర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 చివరి నాటికి ఈ మోడల్‌ను ఇండియన్ రోడ్లపైకి తీసుకురావాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ కొత్త ఎంట్రీతో ప్రీమియం స్కూటర్ల మార్కెట్లో పోటీ నెక్స్ట్ లెవెల్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త ప్లాట్‌ఫామ్.. అదిరిపోయే లిక్విడ్-కూల్డ్ ఇంజిన్

ఈ సరికొత్త 160సీసీ మ్యాక్సీ స్కూటర్ ప్రస్తుతం ఉన్న ఎన్‌టార్క్ కంటే పూర్తిగా భిన్నమైన మరియు సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటోంది. ఇందులో టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉండే లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌‎ను వాడబోతున్నారు. ఈ ఇంజిన్ అఫీషియల్ పవర్ లెక్కలు ఇంకా బయటకు రానప్పటికీ.. దీని రైవల్స్ అయిన యమహా ఎరాక్స్, హీరో జూమ్ స్కూటర్లు దాదాపు 14 నుంచి 15 హార్స్‌పవర్ శక్తిని ఇస్తాయి కాబట్టి, టీవీఎస్ కూడా అదే రేంజ్‌లో అంతకంటే ఎక్కువ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా దీనిని డిజైన్ చేస్తోంది.

హైవే రైడింగ్‌కు కేరాఫ్ అడ్రస్

ఈ కొత్త స్కూటర్ డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యమహా ఎరాక్స్ లాంటి పక్కా స్పోర్టీ లుక్‌తో వస్తుందా లేక హీరో జూమ్ లాంటి అడ్వెంచర్ స్టైల్‌తో వస్తుందా అనేది చూడాలి. లీకైన రిపోర్ట్స్ ప్రకారం.. ఇందులో కంఫర్ట్ కోసం 14 ఇంచుల పెద్ద వీల్స్, గాలి ఒత్తిడిని తట్టుకునేలా బెటర్ విండ్ ప్రొటెక్షన్ గ్లాస్, లాంగ్ వీల్‌బేస్‌ను అందించబోతున్నారు. దీనివల్ల సిటీలో రోజూ ఆఫీసులకు వెళ్లడానికే కాకుండా, వీకెండ్స్‌లో హైవేలపై లాంగ్ టూర్స్ వెళ్లడానికి కూడా రైడర్‌కు సీటింగ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

స్మార్ట్ ఫీచర్లు.. కనెక్టెడ్ టెక్నాలజీ

టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫీచర్లు ఇవ్వడంలో టీవీఎస్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్ లోనూ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఈజీ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇవే కాకుండా హెల్మెట్, ఇతర సామాన్లు పెట్టుకోవడానికి వీలుగా చాలా పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్, సేఫ్టీ కోసం పవర్‌ఫుల్ డిస్క్ బ్రేకులు వంటి ప్రీమియం ఫీచర్లను కూడా ఇందులో జోడించబోతున్నారు. 2027 చివరిలో ఈ స్కూటర్ లాంచ్ అయితే ప్రీమియం స్కూటర్ లవర్స్‌కు ఇదొక బెస్ట్ ఆప్షన్ కానుంది.

Tags:    

Similar News