TVS Radeon 110 : ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కి.మీ మైలేజీ.. నెలకు రూ. 1,800 కట్టి ఈ బైక్ ఇంటికి తెచ్చుకోండి

నెలకు రూ. 1,800 కట్టి ఈ బైక్ ఇంటికి తెచ్చుకోండి

Update: 2025-12-23 10:41 GMT

TVS Radeon 110 : మీరు ఆఫీసుకో లేదా రోజూ వారీ పనులకో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే TVS రేడియాన్ 110 మీకు బెస్ట్ ఛాయిస్ కావచ్చు. అద్భుతమైన మైలేజీ, క్లాసిక్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ బైక్, ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్లతో లభిస్తోంది. కేవలం ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల వరకు ఆగకుండా వెళ్లొచ్చు.

టీవీఎస్ మోటార్స్ నుంచి వచ్చిన రేడియాన్ 110 తన సొగసైన డిజైన్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా దీనిలోని ఆల్-బ్లాక్ ఎడిషన్ యువతకు బాగా నచ్చుతోంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 59,880 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో ఆర్‌టీఓ, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఆన్-రోడ్ ధర సుమారు రూ. 67,000 నుంచి రూ. 77,000 మధ్యలో ఉంటుంది.

మీ దగ్గర ఒకేసారి కట్టడానికి డబ్బులు లేకపోయినా పర్వాలేదు. ఫైనాన్స్ ద్వారా ఈ బైక్ ను సులభంగా పొందవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక రూ. 10,000 డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకుంటే.. 10 శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్ల కాలపరిమితికి ప్రతి నెలా సుమారు రూ. 1,800 నుంచి రూ. 2,000 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. ఇది మీ నెలవారీ ఖర్చుల్లో పెద్ద భారం కాకుండా కొత్త బైక్ ను సొంతం చేసుకునేలా చేస్తుంది.

మధ్యతరగతి ప్రజలు బైక్ కొనేటప్పుడు చూసే మొదటి విషయం మైలేజీ. ఈ విషయంలో రేడియాన్ మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచదు. దీని ARAI సర్టిఫైడ్ మైలేజీ లీటరుకు 73.68కిమీ. ఈ బైక్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. అంటే మీరు ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే దాదాపు 700 కిలోమీటర్ల పైనే ప్రయాణించవచ్చు. రోజుకు 20-30 కిలోమీటర్లు తిరిగే వారికి నెలకు ఒక్కసారి పెట్రోల్ కొట్టిస్తే సరిపోతుంది.

ఇందులో 109.7 cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8.08 bhp పవర్, 8.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు. ఇందులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో దీనికి హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 110, హోండా సీడీ 110 డ్రీమ్ వంటి బైక్‌ల నుంచి గట్టి పోటీ ఉంది.

Tags:    

Similar News