TVS Raider 125 : రైడర్ ప్రియులకు షాక్..సైలెంట్‌గా రేటు పెంచేసిన టీవీఎస్

సైలెంట్‌గా రేటు పెంచేసిన టీవీఎస్

Update: 2026-02-06 08:08 GMT

TVS Raider 125 : యూత్ ఫేవరెట్ బైక్ TVS రైడర్ 125 ధరలను కంపెనీ స్వల్పంగా పెంచింది. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా జరిగిన ఈ ధరల పెంపు, వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.1,250 వరకు ఉంది. 125cc సెగ్మెంట్‌లో స్పోర్టీ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో దూసుకుపోతున్న ఈ బైక్ ధరలు పెరిగినప్పటికీ, కస్టమర్ల జేబుపై ఇది పెద్దగా ప్రభావం చూపబోదని మార్కెట్ వర్గాల అంచనా. ధర పెరిగినప్పటికీ, రైడర్ 125 తన సెగ్మెంట్‌లో అత్యంత ఫీచర్-రిచ్ బైక్‌గా కొనసాగుతోంది. ఇందులో 124.8cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 11.2 bhp పవర్, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, సిటీ రోడ్లపై అత్యుత్తమ పికప్‌ను అందిస్తుంది. ఎకో,పవర్ అనే రెండు రైడింగ్ మోడ్లు ఉండటం దీని ప్రత్యేకత.

రైడర్ 125 కేవలం వేగమే కాదు, టెక్నాలజీని కూడా యువతకు దగ్గర చేసింది. టాప్ వేరియంట్‌లో 5-ఇంచ్ కలర్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, సిగ్నేచర్ డీఆర్‌ఎల్‌లు ఈ బైక్‌కు రోడ్డుపై మంచి గుర్తింపును ఇస్తాయి. హోండా CB 125 హార్నెట్, బజాజ్ పల్సర్ NS 125 వంటి మోడళ్లతో ఇది గట్టిగా పోటీ పడుతోంది.

ధర పెంపు చాలా స్వల్పంగా ఉండటం వల్ల, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నవారు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. అయితే, చాలా కాలంగా రైడర్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు లేవు, కాబట్టి టీవీఎస్ త్వరలో దీనికి రీస్టైలింగ్ చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న ముడి సరుకుల ఖర్చుల కారణంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News