TVS Raider 125 : మార్వెల్ ఫ్యాన్స్‌కు టీవీఎస్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు చెదిరే లుక్‌తో కొత్త ఎడిషన్ లాంచ్
కళ్లు చెదిరే లుక్‌తో కొత్త ఎడిషన్ లాంచ్
TVS Raider 125 : ప్రముఖ టూ వీలర్ సంస్థ టీవీఎస్ మోటార్ తమ మోస్ట్ పాపులర్ 125 సీసీ స్పోర్టీ బైక్ రైడర్ సిరీస్‌లో సుపర్ స్క్వాడ్ ఎడిషన్ కింద సరికొత్త టీవీఎస్ రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. వినోద ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్వెల్ ఫ్రాంచైజీతో టీవీఎస్ కున్న భాగస్వామ్యంలో భాగంగా ఈ ప్రత్యేక బైక్ రూపుదిద్దుకుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 95,320గా నిర్ణయించారు. త్వరలోనే ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
రంగు మారే స్పెక్ట్రల్ గ్రీన్ మ్యాజిక్ ఫైరింగ్
ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లో ప్రధాన ఆకర్షణ దీని స్పెక్ట్రల్ గ్రీన్ పెయింట్ ఫినిషింగ్. డాక్టర్ డూమ్ కామిక్ క్యారెక్టర్ స్క్రీన్ లుక్ ఆధారంగా తయారు చేసిన ఈ రంగు, పడే వెలుగు, చూసే కోణాన్ని బట్టి ఆకుపచ్చ నుంచి గోధుమ రంగు నీడలోకి మారుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో వచ్చిన ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్ థీమ్ బైక్ ల కంటే ఇది పూర్తి భిన్నమైన, ప్రీమియం అగ్రెసివ్ లుక్‌ను అందిస్తుంది.
పవర్‌ఫుల్ ఇంజిన్ అండ్ iGO అసిస్ట్ టెక్నాలజీ
బైక్ మెకానికల్ భాగాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో నమ్మకమైన 125 సీసీ త్రీ-వాల్వ్ ఇంజిన్‌ను యథావిధిగా కొనసాగించారు. ఇది సిటీ రైడింగ్‌కు తగినట్లుగా అద్భుతమైన లో, మిడ్-రేంజ్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, పిక్-అప్ వేగవంతం చేయడానికి, పట్టణ ప్రయాణాల్లో స్మూత్ రైడింగ్ అనుభూతిని ఇవ్వడానికి ఇందులో 'iGO Assist' సాంకేతికతను జోడించారు.
85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు.. సేఫ్టీ సిస్టమ్
డాక్టర్ డూమ్ ఎడిషన్‌లో కనెక్టెడ్ రివర్స్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు ఏకంగా 85 కంటే ఎక్కువ డిజిటల్, కనెక్టెడ్ ఫీచర్లను రైడర్లకు అందుబాటులోకి తెస్తుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, రోడ్డుపై మెరుగైన గ్రిప్ కోసం వెడల్పాటి టైర్లను, టాప్ వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను టీవీఎస్ అందించింది.