Upcoming Rugged SUVs : టాటా, మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీల జాతర.. 2027లో రాబోతున్న రగ్డ్ మోడల్స్ ఇవే

2027లో రాబోతున్న రగ్డ్ మోడల్స్ ఇవే

Update: 2026-03-28 12:09 GMT

Upcoming Rugged SUVs : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం సబ్-4 మీటర్ ఎస్‌యూవీల (4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లు) హవా నడుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ విభాగంలో కేవలం ఫ్యామిలీ కార్లు మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. గరుకు రోడ్లపై కూడా దూసుకెళ్లే రగ్డ్ లుక్ కలిగిన అడ్వెంచర్ ఎస్‌యూవీలను తీసుకురావడానికి దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధమయ్యాయి. 2027 నాటికి ఈ సెగ్మెంట్‌లో పెను మార్పులు రాబోతున్నాయి.

టాటా స్కార్లెట్

మీడియా నివేదికల ప్రకారం టాటా మోటార్స్ స్కార్లెట్ పేరుతో ఒక సరికొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందిస్తోంది. ఇది మోనోకోక్ ఛాసిస్‌పై ఆధారపడి ఉంటుంది. చూడటానికి ఇది టాటా సీయెర్రా లాగే బాక్సీ డిజైన్, నిటారుగా ఉండే రూపాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిని కేవలం ఫ్యామిలీ కారులా కాకుండా, లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా.. అంటే అడ్వెంచర్ ట్రిప్పులకు వెళ్లే వారికి నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే మహీంద్రా థార్, మారుతి జిమ్నీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నెక్షాన్‌లోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120 bhp) లేదా కర్వ్‌లోని 1.2 లీటర్ టర్బో (125 bhp) ఇంజిన్లను వాడే అవకాశం ఉంది. అంతేకాకుండా సీయెర్రాలోని 1.5 లీటర్ ఇంజిన్‌ను కూడా ఇందులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఫీచర్ల పరంగా కూడా టాటా తన మార్క్ చూపిస్తూ అదిరిపోయే ఇంటీరియర్స్ ఇచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా విజన్ ఎస్

మహీంద్రా తన విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ఇది మహీంద్రా పాపులర్ స్కార్పియో కుటుంబంలో చేరే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్ చాలా బాక్సీగా, స్ట్రెయిట్ స్టాన్స్‌తో రగ్డ్‌గా ఉంటుంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. బేస్ వేరియంట్లలో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యాబ్రిక్ సీట్లు మరియు మాన్యువల్ ఏసీ ఉండొచ్చు. అయితే టాప్ ఎండ్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ కారులో మహీంద్రా XUV 3XO నుంచి తీసుకున్న 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 117 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా బ్రాండ్ నుంచి వస్తున్న కారు కాబట్టి, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కూడా మెండుగానే ఉండబోతున్నాయి.

2027లో అడ్వెంచర్ కార్ల హవా!

ప్రస్తుతం సిటీ రోడ్లపై తిరిగే చిన్న ఎస్‌యూవీల కంటే భిన్నంగా, ఆఫ్-రోడింగ్ చేయగలిగే రగ్డ్ కార్ల కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన టాటా, మహీంద్రా సంస్థలు 2027 నాటికి ఈ కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. మీరు కూడా ఒక పవర్‌ఫుల్, రగ్డ్ లుక్ ఉన్న చిన్న ఎస్‌యూవీని కొనాలనుకుంటే, మరికొంత కాలం వేచి చూడటం మంచిది. ఈ రెండు కార్ల రాకతో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ ఆకాశాన్ని తాకడం ఖాయం.

Tags:    

Similar News