Top 5 SUVs : టాప్ మోడల్ ఎందుకు దండగ? ఈ 5 ఎస్‌యూవీల బేస్ వేరియంట్లే ఫీచర్ లోడెడ్
ఈ 5 ఎస్‌యూవీల బేస్ వేరియంట్లే ఫీచర్ లోడెడ్
Top 5 SUVs : కారు కొనాలనుకున్నప్పుడు బడ్జెట్ అందరికీ పెద్ద సవాలే. ముఖ్యంగా ఎస్‌యూవీ కొనాలనే కోరిక ఉన్నప్పుడు, టాప్ ఎండ్ మోడల్ ధర చూసి చాలామంది వెనకడుగు వేస్తారు. ఒకప్పుడు బేస్ మోడల్ అంటే కేవలం ఇంజిన్, టైర్లు తప్ప లోపల ఏమీ ఉండవనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆటోమొబైల్ కంపెనీల మధ్య పెరిగిన పోటీ వల్ల, ఎంట్రీ లెవల్ వేరియంట్లలోనే అదిరిపోయే ఫీచర్లు ఇచ్చేస్తున్నారు. అంటే, అనవసరంగా టాప్ మోడల్ కోసం లక్షల రూపాయలు కుమ్మరించాల్సిన అవసరం లేకుండానే, ప్రీమియం ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు. మరి బేస్ మోడల్ లోనే సూపర్ అనిపించే ఆ 5 ఎస్‌యూవీలు ఏవో చూద్దాం.
1. హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ బేస్ వేరియంట్ చూస్తే ఇది నిజంగా ఎంట్రీ లెవల్ కారేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఏసీ వెంట్స్, నాలుగు పవర్ విండోలు కూడా ఇచ్చారు. దీని ప్రారంభ ధర కేవలం రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). మధ్యతరగతి ఫ్యామిలీకి ఇది ఒక పక్కా ప్యాకేజీ.
2. రెనో డస్టర్
మళ్ళీ కొత్త రూపంలో వస్తున్న రెనో డస్టర్ బేస్ మోడల్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో ఎల్ఈడీ లైట్లు, 17-అంగుళాల స్టీల్ వీల్స్, 7-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షల నుంచి మొదలవుతుంది. డస్టర్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, రఫ్ అండ్ టఫ్ లుక్ తో బేస్ మోడల్ కూడా రోడ్డుపై రాజసం ఉట్టిపడేలా ఉంటుంది.
3. స్కోడా కుషాక్
ప్రీమియం అనుభూతిని కోరుకునే వారికి స్కోడా కుషాక్ బేస్ మోడల్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా బేస్ మోడల్స్ లో సన్‌రూఫ్ ఉండదు, కానీ కుషాక్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు సన్‌రూఫ్, అలాయ్ వీల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇవ్వడం విశేషం. దీని ధర రూ. 10.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
4. కియా సెల్టోస్
ఫీచర్ల విషయంలో కియాను కొట్టేవాడే లేడు. సెల్టోస్ బేస్ వేరియంట్ లోనే 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 12-అంగుళాల డిజిటల్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ, పవర్డ్ ఓఆర్‌వీఎంలు కూడా ఇందులో లభిస్తాయి. దీని ధర రూ.10.99 లక్షల నుండి మొదలవుతుంది. టాప్ మోడల్ కోసం రూ.20 లక్షలు పెట్టలేని వారు కళ్ళు మూసుకుని బేస్ మోడల్ తీసుకోవచ్చు.
5. వోక్స్‌వ్యాగన్ టైగన్
టైగన్ బేస్ వేరియంట్ లగ్జరీ, సేఫ్టీ కలయిక. ఎల్ఈడీ లైట్లు, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు సన్‌రూఫ్ కూడా బేస్ మోడల్ లోనే లభిస్తుంది. జర్మన్ టెక్నాలజీతో బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉండటమే కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు భద్రతను ఇస్తాయి. దీని ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం. ప్రయాణంలో క్లాస్ లుక్ ఉండాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.