Volkswagen: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? దీనిపై ఏకంగా రూ. 3.50 లక్షల డిస్కౌంట్
రూ. 3.50 లక్షల డిస్కౌంట్
Volkswagen: భారతీయ ఆటోమొబైల్ రంగంలో పండుగల జోరు ప్రారంభమైన వేళ ఫోక్స్‌వాగన్ తన టైగన్ ఎస్‌యూవీపై అద్భుతమైన తగ్గింపులను ప్రకటించింది. 2025 మోడల్‌ను ఎంచుకునే కస్టమర్లకు రూ. 2 లక్షల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.లక్ష లిక్విడేషన్ సపోర్ట్ లభిస్తుంది. 2026 మోడళ్లపై రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. వీటితో పాటు అర్హులైన కస్టమర్లకు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 20,000 స్క్రాపేజ్ లబ్ధితో పాటు రూ. 20,000 రాయల్టీ బోనస్ కూడా అందుతోంది. ఈ రకంగా అన్ని ప్రయోజనాలు కలిపితే కస్టమర్లకు ఏకంగా రూ.3.50 లక్షల వరకు ఆదా అవుతుంది.
కొత్త టైగన్ వెర్షన్‌పై సైతం ఆకట్టుకునే డిస్కౌంట్లు
ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన అప్‌డేటెడ్ టైగన్ మోడళ్లపై కూడా కంపెనీ ఆఫర్లు ఇస్తోంది. వేరియంట్‌ను బట్టి రూ.20,000 నుంచి రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్‌ను ఖరారు చేశారు. జిటి లైన్ వెర్షన్‌పై రూ.20,000 కాగా, టాప్‌లైన్ ఆటోమేటిక్, జిటి ప్లస్ డిఎస్‌జి స్పోర్ట్ వేరియంట్లపై రూ. 25,000 వరకు తగ్గింపు వర్తిస్తుంది. వీటితో పాటు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం, రూ.20,000 రాయల్టీ బోనస్ సొంతం చేసుకోవచ్చు. కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షలుగా ఉంది.
.. ఆధునిక హంగులు
అప్‌డేట్ అయిన టైగన్ కారులో మెకానికల్ పరంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 1.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజన్‌తో పాటు కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో వెలుగులీనే కొత్త లోగో, స్టైలిష్ లైట్ బార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. లోపలి భాగంలో పెద్ద డిజిటల్ కాక్‌పిట్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన సౌకర్యాలను పొందుపరిచారు.
3 ఏళ్ల తర్వాత 75 శాతం బైబ్యాక్ గ్యారెంటీ
కారు కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఫోక్స్‌వాగన్ ఒక సంచలన ప్రకటన చేసింది. కారు కొన్న 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వాడకం తర్వాత ఏకంగా 75 శాతం నిశ్చిత బైబ్యాక్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. జర్మన్ కార్ల నిర్వహణ ఖర్చులపై కస్టమర్లలో ఉండే సందేహాలను పటాపంచలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి దిగ్గజ మోడళ్లకు టైగన్ గట్టి పోటీ ఇస్తోంది.