Neeta Ambani : రూ.100 కోట్ల విలువైన కారు కొన్న నీతా అంబానీ

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 మాత్రమే ఉన్న ఆడీ ఏ9 కమెలియన్‌ మోడల్‌ కార్లు;

Update: 2025-08-11 07:16 GMT

మార్కెట్‌లోకి విలాసవంతమైన ఖరీదైన కార్లు ఏవి వచ్చినా నీతా అంబానీ ఆ కారుని కైవశం చేసుకోవాల్సిందే. తాజాగా ప్రముఖ జర్మన్‌ కార్ల తయారీ కంపెనీ ఆడీ ఏ9 కమెలియన్‌ మోడల్‌ కారును నీతా అంబానీ కొనుగోలు చేశారు. దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఈ కారు ఇండియాలోనే మొదటి కారు కలిగిఉన్న వ్యక్తిగా నీతా అంబానీ నిలుస్తారు. అత్యంత విలాసవంతమైన ఈ ఆడీ ఏ9 కమెలియన్‌ కారలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కారు ఎప్పటికప్పుడు అనేక రంగులను మారుస్తుంది. కేవలం ఒక బటన్‌ నొక్కడంతోనే ఈ కారులో కావాల్సిన రంగులు మార్చుకోవచ్చు. ఇది అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ వాహనంగా పరిగణించబడుతుంది, ప్రపంచవ్యాప్తంగా అరుదుగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. నీతా అంబానీ ఖరీదు చేసిన ఆడీ ఏ9 కమీలియన్‌ కారు సింగిల్-పీస్ విండ్‌ స్క్రీన్ మరియు పైకప్పు కలిగి ఉంటుంది. ఇది అంతరిక్ష నౌక లాంటి రూపం కలిగి ఉన్న ఈ కారు ఐదు మీటర్ల పొడవుతో విలక్షణమైన రెండు డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ప్రపంచంలో ఈ ఆడీ ఏ9 కమెలియన్‌ మోడల్‌ కార్లు 11 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి నీతా అంబానీది అవ్వడం విశేషం. ఆడి A9 కమెలియన్ 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో అమర్చబడి ఉంది, ఇది భారీ 600 హార్స్‌పవర్‌ను అందిస్తుంది, స్వచ్ఛమైన శక్తిని అంతిమ అధునాతనతతో మిళితం చేస్తుంది. ఆడి A9 కమెలియన్ అనేది అత్యుత్తమమైన వాటిని కోరుకునే వారి కోసం రూపొందించబడిన హైటెక్ యంత్రం. ఆడి A9 మూడున్నర సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీటర్లు. నీతా అంబానీ అత్యంత విలాసవంతమైన ఆడి ఏ9 కమెలియన్‌ కారుతో పాటు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB, మెర్సిడెస్-మేబాచ్ S600 గార్డ్, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్ మరియు BMW 7 సిరీస్ 760Li సెక్యూరిటీ వంటి అనేక ఇతర లగ్జరీ కార్లు కలిగి ఉన్నారు.

Tags:    

Similar News