RBI New Rules: దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిమిషాల్లోనే డబ్బులు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతున్నారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. నవంబర్ 23న 'Preventive Safeguards for Electronic Banking Transactions' పేరుతో ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం బ్యాంకు ఖాతాదారులు తమ డిజిటల్ చెల్లింపులపై మరింత నియంత్రణ పొందుతారు. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ఈ ప్రతిపాదనలు వర్తించనున్నాయి.

ఒక్క క్లిక్‌తో UPI, నెట్ బ్యాంకింగ్ సేవలకు లాక్

RBI ప్రతిపాదనల్లో ముఖ్యమైనది డిజిటల్ పేమెంట్ సేవలను ఎప్పుడైనా నిలిపివేసే సదుపాయం. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాదారులు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేవారు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వీటిలో ఏ సేవనైనా ప్రత్యేకంగా ఆఫ్ చేసుకోవచ్చు. అవసరమైతే అన్ని డిజిటల్ చెల్లింపు మార్గాలను ఒకేసారి నిలిపివేయవచ్చు. ఉదాహరణకు మీరు కొంతకాలం యూపీఐ ఉపయోగించకూడదనుకుంటే దాన్ని లాక్ చేసుకోవచ్చు. అలా నిలిపివేసిన సేవ ద్వారా లావాదేవీలు జరగకుండా నియంత్రణ ఉంటుంది. తిరిగి ఉపయోగించాలనుకున్నప్పుడు బ్యాంకు యాప్ లేదా బ్రాంచ్ ద్వారా ఆ సేవను ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం OTP లేదా బ్యాంకు నిర్ణయించిన ఇతర భద్రతా పద్ధతులతో మీ గుర్తింపును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

రోజుకు ఎంత పంపాలి? ఒక్కసారి ఎంత పంపాలి? మీరే నిర్ణయించుకోవచ్చు!

డిజిటల్ పేమెంట్లను నిలిపివేయడమే కాకుండా లావాదేవీలపై ఐదు రకాల పరిమితులు పెట్టుకునే అవకాశం కూడా RBI ప్రతిపాదించింది.

- ఒక్కో లావాదేవీ పరిమితి: ఒకసారి చేసే చెల్లింపులో గరిష్టంగా ఎంత డబ్బు పంపాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రూ.10 వేల వరకు మాత్రమే చెల్లించేలా పెట్టుకోవచ్చు.

- వ్యక్తి ఆధారిత పరిమితి: ఒక నిర్దిష్ట వ్యక్తికి రోజులో ఎంత డబ్బు పంపాలో నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రోజుకు రూ.20 వేలకు మించకుండా పరిమితి పెట్టుకోవచ్చు.

- రోజువారీ ఛానల్ పరిమితి: యూపీఐ లేదా ఇతర చెల్లింపు మార్గాల ద్వారా రోజులో మొత్తం ఎంత ఖర్చు చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 వేల పరిమితి పెట్టుకోవచ్చు.

- అన్ని చెల్లింపులకు కలిపి పరిమితి: యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇలా అన్ని మార్గాల ద్వారా కలిపి రోజుకు ఎంత చెల్లించాలో నిర్ణయించుకోవచ్చు.

- సమయ పరిమితి: రోజులో ఏ సమయంలో డిజిటల్ పేమెంట్లు అందుబాటులో ఉండాలి, ఏ సమయంలో నిలిపివేయాలనేది కూడా ఎంచుకోవచ్చు.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. బ్యాంకు అనుమతించిన గరిష్ట పరిమితిని కస్టమర్లు పెంచలేరు. దానికంటే తక్కువగా మాత్రమే తమకు నచ్చిన లిమిట్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు బ్యాంకు ఒకసారి యూపీఐ ద్వారా రూ.లక్ష వరకు పంపేందుకు అనుమతిస్తే.. మీరు దాన్ని రూ.20 వేలకు తగ్గించుకోవచ్చు. కానీ రూ.1.5 లక్షలకు పెంచుకోవడం సాధ్యం కాదు.

ATM, డెబిట్, క్రెడిట్ కార్డులకూ కొత్త నియంత్రణలు

RBI కొత్త ప్రతిపాదనలు యూపీఐకే పరిమితం కావడం లేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంపైనా ఖాతాదారులకు మరిన్ని నియంత్రణలు కల్పించనుంది. కార్డులను అవసరమైనప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయం కల్పించాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాదు.. కార్డుల లావాదేవీలకు కూడా పరిమితులు పెట్టుకోవచ్చు. ATMలో నగదు తీసుకోవడం, POS మెషీన్ల ద్వారా చెల్లింపులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకు ఈ నియంత్రణలు వర్తిస్తాయి. దేశీయంగా చేసే లావాదేవీలతో పాటు విదేశాల్లో జరిగే చెల్లింపులపైనా నియంత్రణ పెట్టుకోవచ్చు. అయితే బ్యాంకు నిర్ణయించిన గరిష్ట పరిమితికి లోబడే కస్టమర్లు తమ లిమిట్లను మార్చుకోవాలి. బహుమతులుగా ఇచ్చే ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, ప్రజా రవాణా కోసం ఉపయోగించే ట్రాన్సిట్ కార్డులకు ఈ ప్రతిపాదనలు వర్తించవు.

RBI కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ కొత్త నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదు. RBI ప్రస్తుతం వీటిని ముసాయిదా …

Tags: