Royal Enfield : రాయల్ సవారీ మరింత ప్రియం.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు పెరిగాయ్!
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ధరలు పెరిగాయ్!;
Royal Enfield : కొత్త బుల్లెట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే అయితే మీకో షాకింగ్ న్యూస్. ప్రముఖ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ కొన్ని బైక్‌ల ధరలను పెంచింది. ఈ జాబితాలో బుల్లెట్ 350 బటాలియన్ బ్లాక్, మిలిటరీ రెడ్ వంటి వేరియంట్లు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఇప్పుడు బుల్లెట్ అన్ని వేరియంట్లు కొద్దిగా ఖరీదైనవిగా మారాయని కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్ల ధరలలో రూ.2,000 నుండి రూ.3,000 వరకు పెరుగుదల ఉంది.
బుల్లెట్ 350 కొత్త ధరలు
బుల్లెట్ 350 కొత్త ధరల విషయానికి వస్తే, ఇప్పుడు దీని బటాలియన్ బ్లాక్ వెర్షన్ రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. ఇదే దాని జాబితాలో అత్యంత చౌకైన మోడల్‌గా మారింది. మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్ వంటి వేరియంట్ల ధర ఇప్పుడు రూ.1.76 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ వెర్షన్ (బ్లాక్, మెరూన్) ధర ఇప్పుడు రూ.2 లక్షలు. అత్యంత ప్రీమియం మోడల్ అయిన బ్లాక్ గోల్డ్ కొత్త ధర రూ.2.18 లక్షలుగా ఉంది.
ఇంజిన్, ఫీచర్లు, మైలేజ్ వివరాలు
ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో గతంలో మాదిరిగానే 349సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 bhp శక్తిని, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించే 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, బైక్‌లో అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు ట్రిప్, నావిగేషన్ వంటి సమాచారాన్ని అందించే డిజిటల్ LCD స్క్రీన్ ఉంటుంది. దీంతో పాటు, USB ఛార్జింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, డిస్క్ బ్రేక్‌లు, సింగిల్/డ్యూయల్ ఛానల్ ABS, స్పోక్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్ కూడా ఇందులో అందించారు. మైలేజ్ విషయానికి వస్తే.. ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రకారం ఈ బైక్ 37 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది.రియల్ వర్లడ్ లో మాత్రం మైలేజ్ లీటరుకు 30 నుంచి 40 కి.మీ. వరకు ఉండవచ్చు. దీని 13 లీటర్ల ఇంధన ట్యాంక్ నిండుగా ఉంటే, సుమారు 460+ కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. మరి ఈ ధరల పెంపు బుల్లెట్ విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.