Money Tips : డబ్బు సంపాదించే మ్యాజిక్. ఐదేళ్లలో రూ. 8 లక్షలు.. అదే పెట్టుబడి 20 ఏళ్లలో రూ.కోటి దాటుతుంది!
అదే పెట్టుబడి 20 ఏళ్లలో రూ.కోటి దాటుతుంది!
Money Tips : మీరు సంపాదించిన డబ్బును అలాగే వదిలేస్తే ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మీరు పొదుపు చేసిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. డబ్బు మహిమ బయటపడాలంటే పెట్టుబడి చాలా అవసరం. చాలా మంది పెట్టుబడి పెడతారు.. కానీ త్వరగా ఓపిక కోల్పోతారు. 20 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అని భావించి పెట్టుబడి మొదలుపెట్టిన వారు, ఐదు సంవత్సరాలు అయ్యేసరికి నిరాశ చెంది పెట్టుబడి నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ వీరికి, తరువాతి సంవత్సరాలలో డబ్బు కాంపోండింగ్ పవర్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియకుండా పోతుంది.
ఒక ఆర్థిక నిపుణుడి సలహా మేరకు, మీరు 20 సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో నెలకు రూ. 10,000 చొప్పున SIP మొదలుపెట్టారని అనుకుందాం. మీ SIP ఉన్న మ్యూచువల్ ఫండ్ సగటున సంవత్సరానికి 12% రిటర్న్ ఇస్తుంది అనుకుంటే, మీ పెట్టుబడి విలువ ఎలా మారుతుందో చూద్దాం. 1 సంవత్సరం తర్వాత మీ SIP పెట్టుబడి విలువ రూ. 1.28 లక్షలు అవుతుంది. మీకు వచ్చిన రిటర్న్ కేవలం రూ. 8,093 మాత్రమే. 5 సంవత్సరాల తర్వాత మీరు మొత్తం రూ. 6,00,000 కట్టి ఉంటారు. మీ పెట్టుబడి విలువ రూ. 8,24,864 అవుతుంది. అంటే, 5 సంవత్సరాలలో మీకు వచ్చిన రిటర్న్ రూ. 2.24 లక్షలు. ఈ దశలోనే చాలా మంది కోటి రూపాయల లక్ష్యం అసాధ్యం అని నిరాశ చెందుతారు. కానీ, ఇక్కడి నుంచి మొదలయ్యే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని చాలా మందికి తెలియదు.
మీరు నెలకు రూ. 10,000/- చొప్పున అదే పెట్టుబడిని కొనసాగిస్తే తరువాత 5 సంవత్సరాలలో రూ. 8.24 లక్షలు అయిన మీ పెట్టుబడి, తరువాత 5 సంవత్సరాలలో (మొత్తం 10 సంవత్సరాలకి) ఏకంగా రూ. 23 లక్షలు అవుతుంది. మీ పెట్టుబడి దాదాపు రెట్టింపు అవుతుంది. మీరు మరో 5 సంవత్సరాలు SIP కొనసాగిస్తే, మీ పెట్టుబడి విలువ రూ. 50 లక్షలు దాటిపోతుంది. ఇంకో ఐదేళ్లు పెట్టుబడి కొనసాగించినట్లయితే, మీ పెట్టుబడి విలువ రూ.కోటి లక్ష్యాన్ని చేరుకుంటుంది. అంటే, మీరు 20 సంవత్సరాల వరకు ఓపికతో, నిరంతరంగా SIP కొనసాగించినట్లయితే, మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మీరు ఆ పెట్టుబడిని ఇంకా 10 సంవత్సరాలు (మొత్తం 30 సంవత్సరాలు) కొనసాగించినట్లయితే, మీరు ఏకంగా రూ. 3.50 కోట్లకు యజమాని కావచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి నుంచి మీకు లభించే అద్భుతమైన రిటర్న్.