YouTube : జూలై 15నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్.. ఇక డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు

ఇక డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు;

Update: 2025-07-14 10:21 GMT

YouTube : ఈ డిజిటల్ యుగంలో యూట్యూబ్ కేవలం వీడియోలు చూసే ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు.. లక్షలాది మందికి ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ పెరుగుతున్న పాపులారిటీ చిన్న, కొత్త క్రియేటర్లకు కూడా పేరు, డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ తన సిస్టమ్‌లో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ఇది జూలై 15, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఈ మార్పు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న లేదా సంపాదించాలనుకుంటున్న ప్రజలందరిపై నేరుగా ప్రభావం చూపుతుంది.

యూట్యూబ్ తన పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో కొత్త నియమాలను తీసుకొస్తోంది. దీనివల్ల క్రియేటర్లకు యాడ్ రెవెన్యూతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. అయితే, దీని కోసం కొన్ని కొత్త షరతులు పాటించాల్సి ఉంటుంది.

YPPలో చేరడానికి కండీషన్లు

* కనీసం 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి.

* గత 90 రోజుల్లో 3 వీడియోలు అప్‌లోడ్ చేసి ఉండాలి.

* గత 12 నెలల్లో 3,000 గంటల వాచ్ టైమ్ ఉండాలి.

* లేదా, 90 రోజుల్లో 3 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉండాలి.

యూట్యూబ్ ఏఐ కంటెంట్, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ పై కఠినమైన నిఘా ఉంచుతుంది. ఏదైనా క్రియేటర్ ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారి వీడియోను డీమోనెటైజ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఛానల్‌ను YPP నుంచి తొలగించవచ్చు, దీనివల్ల ఆదాయం నిలిచిపోతుంది.

ఏ క్రియేటర్లకు నష్టం?

* కేవలం షార్ట్ వీడియోలు మాత్రమే చేస్తే ఎంగేజ్ మెంట్ టైం తక్కువ ఉంటుంది. అలాంటి క్రియేటర్లకు నష్టం.

* వారి కంటెంట్ పదేపదే కాపీరైట్ లేదా రియూజ్డ్ కంటెంట్‌గా యూట్యూబ్ గుర్తిస్తే డబ్బులు రావు.

* కేవలం ఏఐ వీడియోలు చేసి యూట్యూబ్ పాలసీలను ఉల్లంఘించే క్రియేటర్లకు వారి ఆదాయంపై ప్రభావం పడవచ్చు.

ఈ నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

* ఒరిజినల్, క్వాలిటీ కంటెంట్‌ను క్రియేట్ చేయాలి.

* రూల్స్ జాగ్రత్తగా చదవాలి. పాటించాలి.

* ఏఐ కంటెంట్‌ను తెలివిగా, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

* కాపీరైట్ లేని మ్యూజిక్, వీడియోలు, ఫోటోలను ఉపయోగించాలి.

* దీనితో పాటు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలి.

Tags:    

Similar News