Lokesh Kanagaraj’s ‘DC’: బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల హిట్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లోకేశ్ కనగరాజ్ డీసీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Lokesh Kanagaraj’s ‘DC’: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా మారి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం డీసీ . టాలెంటెడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ వేదికగా ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హీరోగా లోకేశ్ మేనియా
దర్శకుడిగా వరుస బ్లాక్‌బస్టర్లతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించిన లోకేశ్ కనగరాజ్, తొలిసారి లీడ్ రోల్‌లో నటించినప్పటికీ తనదైన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను మెప్పించారు.
కథానాయికగా వామికా గబ్బి నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి రూ.100 కోట్ల మార్కును అందుకుంది. థియేటర్లలో మిస్సయిన సినీ ప్రియులతో పాటు, మరోసారి ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వీక్షించాలనుకునే ప్రేక్షకులకు సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్‌లో వినోదం పంచనుంది.