Actress Chandini Chowdary: నటి చందిని చౌదరికి చేదు అనుభవం
చేదు అనుభవం
Actress Chandini Chowdary: నటి చందిని చౌదరి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన "ది ఆడిషన్ షో" కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఒక నిర్మాత తనను సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపారు.
2015లో "బ్రహ్మోత్సవం" సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశం ఇస్తానని ఒక నిర్మాత చందినిని సంప్రదించాడు. మొదట ఆయన ఆమె తల్లి సమక్షంలోనే మాట్లాడినప్పటికీ, ఆ తర్వాత చందినికి వ్యక్తిగతంగా ఫోన్ చేశాడు.
ఆ నిర్మాత తన రూపురేఖల గురించి, ఛాయ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ పరోక్షంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డానని చందిని తెలిపారు. అయితే ఆమె ఆ నిర్మాత కోరికను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ నిర్మాత తన తల్లికి కూడా ఫోన్ చేసి చాలా అనుచితంగా ప్రవర్తించాడని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ ఘటనతో ఆమె తల్లి తీవ్రంగా భయపడినప్పటికీ, మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ నిర్మాతను గట్టిగా హెచ్చరించారు.
అలాగే 2024లో అదే నిర్మాతను మరోసారి కలిసినట్లు చందిని వెల్లడించారు. తాను నేరుగా ఆయనను ఎదుర్కొని, "అప్పట్లో నాతో గడపాలని కోరింది నువ్వే కదా?" అని ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ ప్రశ్నతో ఆ నిర్మాత ఒక్కసారిగా షాక్ అయిపోయి మాట్లాడలేకపోయారని ఆమె తెలిపారు.
"గామి" వంటి పలు తెలుగు చిత్రాలలో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందిని చౌదరి, తెలుగు అమ్మాయి కావడంతో పాటు ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు.