Actress, Former MP Ramya: మగాళ్లను కుక్కలతో పోల్చిన హీరోయిన్ ..దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Actress, Former MP Ramya: నటి , మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రాజకీయ నాయకులను, ముఖ్యంగా తనను విమర్శించే వారిని ఉద్దేశించి ఆమె చేసిన ఈ పోలిక తీవ్ర చర్చకు దారితీసింది. రమ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, మనుషులకు, కుక్కలకు మధ్య ఉన్న ప్రవర్తనా భేదాల గురించి ప్రస్తావించారు."కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, కానీ కొంతమంది మనుషులు మాత్రం కుక్కల కంటే హీనంగా ప్రవర్తిస్తారు". మగాడు ఎప్పుడు అత్యాచారం చేస్తాడో.. ఎప్పుడు హత్య చేస్తాడో మనకు తెలియదు. అని అని అంచనా వేయలేమనే కారణంతో పురుషులందరినీ జైల్లో పెడదామా? అని ప్రశ్నించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసేవారిని, తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. "ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష వాడటం తగదు" అని చాలా మంది విమర్శిస్తున్నారు. మనుషులను జంతువులతో పోల్చి కించపరచడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.: ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ట్రోలర్లకు ఇది సరైన సమాధానమని ఆమె అభిమానులు కొందరు మద్దతు తెలుపుతున్నారు.
రమ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె రాజకీయ నాయకులపై చేసిన కొన్ని ట్వీట్లు కోర్టు కేసుల వరకు వెళ్ళాయి. ప్రస్తుతం ఆమె సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం సినిమా వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.