Actress Keerthy Suresh: పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నా..
పెళ్లి చేసుకుందామనుకున్నా..
Actress Keerthy Suresh: చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్ తో కీర్తి సురేశ్ 2024లో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 2024 డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరిగింది. ఫొటోలు కూడా నెట్టింట అప్పట్లో బాగా వైరలయ్యా యి. ఘనంగా జరిగిన వారి విదాహ వేడుక గురించి తాజాగా నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. పెళ్లి అంత గ్రాండ్ గా అవుతుందని అనుకోలేదట. ఇద్దరూ 15 ఏళ్లు ప్రేమలో ఉన్నారట. ఖచ్చి తంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామనే అనుకుందట. కానీ ఇంట్లో అంగీకరించడం తో ఘనంగా జరిగి కల నిజమైనట్లు అనిపించిందట. అందుకే తమ వివాహ వేడుకలో తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పింది. ఒక్కక్షణం నోట మాట రాలేదని పేర్కొంది. 15 ఏళ్ల ప్రేమ 30 సెకన్లలో తాళి కట్టే సమయంలో కళ్ల ముందు కదలాడిందని, దీంతో ఆనంద బాష్పాలు ఆగలేదని చెప్పింది. తానే కాదు. ఆంటోని కూడా నమ్మలేకపోయాడట. అతడు కూడా ఎమోషనల్ కావడంతో మొ. దటిసారి ఆంటోనీ కళ్లల్లో నీళ్లు చూశానని, ఇది ఓ అందమైన ప్రయాణం అని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్.