Actress Nargis Fakhri: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్
Actress Nargis Fakhri: ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ రహస్య వివాహానికి సంబంధించిన విషయం అనూహ్యంగా బయటపడింది. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈవెంట్‌లో దర్శకురాలు ఫరా ఖాన్ పొరపాటున అన్న మాటతో నర్గీస్ పెళ్లి రహస్యం అందరికీ తెలిసిపోయింది. ఈ ఈవెంట్‌లో నర్గీస్ ఫక్రీ, ఫరా ఖాన్ కలిసి రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టోనీ బేగ్‌ను చూసి ఫరా ఖాన్.. ‘‘టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు’’ అని పిలిచారు. ఫరా ఖాన్ ఈ మాట అనగానే నర్గీస్, టోనీ బేగ్ భార్యాభర్తలు అని అందరికీ అర్థమైంది. దీంతో అక్కడున్న వారితో పాటు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.
నర్గీస్ ఫక్రీ, అమెరికాకు చెందిన వ్యాపారవేత్త టోనీ బేగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియాలో వీరి వివాహం జరిగిన తర్వాత ఈ జంట స్విట్జర్లాండ్‌లో హనీమూన్ జరుపుకున్నట్లు సమాచారం. ఆరు నెలలకు పైగా ఈ విషయాన్ని నర్గీస్ గోప్యంగా ఉంచడంపై అభిమానులు చర్చించుకుంటున్నారు. 'రాక్‌స్టార్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నర్గీస్ ఫక్రీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటీవల విడుదలైన 'హౌస్‌ఫుల్-5'తో ఆమె మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన రహస్య వివాహం వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు.