Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం ఫస్ట్ సాంగ్‌లో ముగ్గురు హీరోయిన్లు.. సెప్టెంబర్ 22 నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్!
మ్యూజిక్ ప్రమోషన్స్!
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్‌ను సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఇందులో భాగంగా సినిమా నుంచి విడుదల చేయబోయే మొదటి పాటను ప్రకటించారు. ‘నారాయణమ్మ’ అనే పేరుతో ఈ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ పాటకు ఎస్. థమన్ సంగీతం అందించారు. వెంకటేష్‌తో పాటు సినిమాలోని ముగ్గురు హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, నివేతా పేతురాజ్, డింపుల్ హయాతి ఈ పాటలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేష్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నారు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ పాట సరదాగా సాగే పార్టీ సాంగ్‌లా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి వెంకటేష్ భార్య పాత్రలో నటిస్తోంది. నివేతా పేతురాజ్ ఆయన పక్కింటి మహిళగా కనిపించనుంది. ఇక డింపుల్ హయాతికి సినిమాలో కొంచెం చిన్న పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురు హీరోయిన్లతో వెంకటేష్ తెరపై ఎలా సందడి చేయనున్నారో తెలుసుకోవాలంటే పాట విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం ప్రమోషన్స్ విషయంలో కాస్త నెమ్మదిగా ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ‘నారాయణమ్మ’ పాటతో సినిమా ప్రమోషన్స్‌కు మంచి ఊపు వస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల కానున్న తొలి పాట ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.