Aishwarya Lekshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాకాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించబోతోందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్లపై స్వయంగా ఆమే స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు.

ఆ వార్తలు చూసి నవ్వుకున్నా: ఐశ్వర్య లక్ష్మి

రాకా సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఐశ్వర్య లక్ష్మి కొట్టిపారేశారు. ఈ ప్రచారాన్ని చూసి మొదట తానే ఆశ్చర్యపోయి నవ్వుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. "అట్లీ దర్శకత్వంలో బన్నీ సరసన నటించే అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా? ఎవరైనా నాకు ఆ సినిమాలో అవకాశం ఇప్పిస్తే నిజంగా సంతోషిస్తా" అంటూ చమత్కరించారు. ఆమె ఇచ్చిన ఈ వివరణతో నెగెటివ్ రోల్ వార్తలకు తెరపడింది.

భారీ కాస్టింగ్.. స్క్రీన్‌పై నలుగురు కథానాయికలు?

రాకాలో మొత్తం నలుగురు కథానాయికలకు చోటుందన్న ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం. ప్రధాన కథానాయికగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తున్నారు. మలయాళ నటి మినా జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర పాత్రల కోసం జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ, నిర్మాణ సంస్థ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.

Tags: