Akhanda 2 Storms the Box Office: బాక్సాఫీస్‌పై అఖండ 2 తాండవం.. తొలిరోజు కలెక్షన్ల సునామీ
తొలిరోజు కలెక్షన్ల సునామీ
Akhanda 2 Storms the Box Office: నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ 2 బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్ తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలిరోజే ఏకంగా రూ. 59.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ వసూళ్లతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అఖండ 2 నిలిచింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.
2021లో విడుదలై సంచలనం సృష్టించిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందింది. ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ నటన, బోయపాటి శ్రీను మాస్ టేకింగ్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనగానే నెలకొన్న భారీ అంచనాలు, కలెక్షన్ల రూపంలో నిజం కావడం విశేషం.